2 / 5
హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఎన్డీఏ పార్టీల నేతలు..కార్యక్రమం అనంతరం చండీగఢ్‌లో జరిగిన కూటమి భేటీలో పాల్గొన్నారు. కేంద్రంలో ఎన్‌డీఏ సర్కారు మూడోసారి కొలువు దీరిన తర్వాత కూటమి నేతలు భేటీ కావడం ఇదే మొదటిసారి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలొచ్చాక ఢిల్లీలో ఒకసారి సమావేశమైనా.. అది లాంఛనప్రాయమే. సమావేశంలో ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.