
October Tour: చాలా మంది చల్లని వాతావరణాల్లో సమయాన్ని గడిపేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి ప్రాంతాలను భాగస్వామితో కలిసి పర్యటనకు వెళ్లి జ్ఞాపకాలను సంపాదించుకోవాలి కోరుకుంటారు. ఇందుకు అక్టోబర్ నెలలోని వాతావరణం అన్నివిధాల అనుకూలంగా ఉంటుంది.

బిర్ బిల్లింగ్: హిమాచల్ ప్రదేశ్‌లోని బిర్ బిల్లింగ్‌ను సందర్శించడానికి అక్టోబర్ నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీరు ఇక్కడ అందమైన లోయలు, దట్టమైన అడవులలో తిరుగుతూ సమయాన్ని హాయిగా గడపవచ్చు. మీకు అడ్వేంచర్ ఇష్టమైతే ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా చేయవచ్చు.

ముస్సోరీ: ఢిల్లీకి సమీపంగా ఉండే ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీ హనీమూన్‌కి వెళ్లాలనుకునేవారి ఎంపికల్లో ఒకటి. భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపాలనుకునేవారు నిరభ్యంతరంగా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. ఇక్కడ మీరు కెంప్టీ ఫాల్స్, మాల్ రోడ్, గన్ హిల్ వంటి ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు.

జోధ్‌పూర్: బ్లూ సిటీగా ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ చరిత్రను తెలుసుకోవాలనుకునేవారికి గమ్యస్థానం వంటిది. ఇక్కడ మీరు చారిత్రక కట్టడాలతో పాటు ఎడారి సఫారీ, బోటింగ్ వంటి వాటితో కూడా జ్ఞాపకాలను సమకూర్చుకోవచ్చు.

పంచమర్హి: పంచమర్హి మధ్యప్రదేశ్‌లో ఉన్న చాలా అందమైన హిల్ స్టేషన్. చుట్టూ పచ్చదనంతో కూడిన ఇక్కడి అందమైన దృశ్యాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి.ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశం స్వర్గం కంటే తక్కువేం కాదు. మీరు ఇక్కడ జటాశంకర్ గుహలను చూడటానికి కూడా వెళ్ళవచ్చు.