Pet Health: పెట్‌ డాగ్‌, యజమాని బాండింగ్‌ మరీ ఇంతలా ఉంటుందా! ఆ విషయాన్ని వాసన చూసి పసిగట్టేస్తాయట..

|

Aug 30, 2024 | 8:53 PM

నేటి జీవనశైలి కారణంగా చాలా మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. మీ ఇంట్లో పెంపుడు జంతువు ఉంటే అది మీ మానసిక ఆరోగ్యాన్ని కాకుండా మీ పెంపుడు జంతువు మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? అవును.. తాజా పరిశోధనలు ఈ విషయాన్ని వెల్లడించాయి..

1 / 5
నేటి జీవనశైలి కారణంగా చాలా మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. మీ ఇంట్లో పెంపుడు జంతువు ఉంటే అది మీ మానసిక ఆరోగ్యాన్ని కాకుండా మీ పెంపుడు జంతువు మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? అవును.. తాజా పరిశోధనలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

2 / 5
మీరు ఒత్తిడికి లోనైతే మీ పెంపుడు జంతువు వాసన ద్వారా గ్రహిస్తుందని 'సైంటిఫిక్ రిపోర్ట్స్' జర్నల్‌లో ఇటీవల ప్రచురించిన ఓ అధ్యయనం పేర్కొంది. బ్రిస్టల్ విశ్వవిద్యాలయం, కార్డిఫ్ విశ్వవిద్యాలయం, బ్రిటీష్ స్వచ్ఛంద సంస్థ మెడికల్ డిటెక్షన్ డాగ్స్ సంయుక్తంగా చేపట్టిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

3 / 5
ఈ అధ్యయనాన్ని నిర్వహించడానికి శాస్త్రవేత్తలు 18 జతల కుక్కలను, వాటి యజమానులను ఎంచుకున్నారు. పెంపుడు జంతువులు వాటి యజమానులను విడిగా ఉంచారు. అక్కడ వాటికి ఆట పరికరాలు అందించి, బహిరంగ ప్రదేశంలో వదిలిపెట్టారు. తద్వారా అవి ఒత్తిడి లేకుండా ఉంటాయి. కానీ పరిశోధకులు కుక్క యజమానిని మానవ ఒత్తిడికి గురి చేశారు.

4 / 5
అప్పుడు వారి చెమటతో తడిసిన గుడ్డ, ఆహారం తిన్న పాత్రలను వారి పెంపుడు కుక్క ముందు ఉంచారు. పెంపుడు కుక్క వారి చెమట వాసన ద్వారా సంరక్షకుని ఆందోళనను అర్థం చేసుకోగలవని గ్రహించారు.తమకు ఇష్టమైన ఆహారం గిన్నెను నోటి ముందు పెట్టుకున్నా ఆహారం పట్ల అవి ఆసక్తి కనబరచలేదని, పైగా అవి చాలా ఆందోళనగా కనిపించినట్లు గుర్తించారు. అప్పటి వరకూ ఉన్న ప్రశాంతత కుక్కల్లో అదృశ్యమైంది.

5 / 5
ఈ సందర్భంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ ప్రధాన్‌ మాట్లాడుతూ.. కుక్కలు మనిషి ప్రవర్తనలో మార్పును పసిగట్టగలవు. ఇది వాటి మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. కుక్కల ప్రశాంతత తగ్గుతుంది. ఇది వాటి శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. తమ యజమానులు అనారోగ్యంతో ఉన్నప్పు, మరణించినప్పుడు కుక్కలు కళ్లలో నీళ్లు పెట్టడం మీరు అనేక సందర్భాల్లో వార్తల్లో చూసే ఉంటారు. ఇలాంటప్పుడు అవి తమ యజమానుల పక్కకి వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చుంటాయి. తినడానికి, తాగడానికి కూడా అయిష్టత చూపుతాయి. అందువల్ల, కుక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన ఆరోగ్యంపై మరింత అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే మూగజీవి ఆరోగ్యం దెబ్బతింటుంది.