అరటి పండ్లు ఈ టైంలో తింటే ఎన్నో లాభాలు మీ సొంతం!

Updated on: Jan 16, 2026 | 1:24 PM

Best Time to Eat Banana for good Health:ఏడాది పొడవునా లభించే పండ్లలో అరటిపండు ఒకటి. అరటిపండ్లను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. అయితే అరటిపండ్లను ఎల్లప్పుడు సరైన పద్ధతిలోనే తినాలి. తద్వారా వీటిల్లోని పోషకాలను పూర్తిగా పొందొచ్చు.

1 / 5
ఏడాది పొడవునా లభించే పండ్లలో అరటిపండు ఒకటి. అరటిపండ్లను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. అయితే అరటిపండ్లను ఎల్లప్పుడు సరైన పద్ధతిలోనే తినాలి. తద్వారా వీటిల్లోని పోషకాలను పూర్తిగా పొందొచ్చు.

2 / 5
ఉదయం నిద్రలేచిన తర్వాత అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ బి6, పొటాషియం రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మలబద్ధకంతో బాధపడేవారికి ఉదయం అరటిపండ్లు తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

3 / 5
జిమ్‌కు వెళ్లే ముందు లేదా వ్యాయామం చేసే ముందు 1 లేదా 2 అరటిపండ్లు తినడం మంచిది. అరటిపండ్లలోని కార్బోహైడ్రేట్లు వ్యాయామానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అలాగే  పొటాషియం కండరాల తిమ్మిరిని నివారిస్తుంది. ఇది కండరాలను కూడా బలపరుస్తుంది.

4 / 5
భోజనం తర్వాత అరటిపండ్లు తినడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. అరటిపండ్లలోని ఫైబర్ ఆహారం జీర్ణం కావడానికి దోహదపడుతుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది.

5 / 5
సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య ఆకలిగా అనిపించినప్పుడు జంక్ ఫుడ్ కు బదులుగా అరటిపండ్లు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది స్నాక్స్ తినే అలవాటును వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఇది శరీరానికి అవసరమైన పోషణను కూడా అందిస్తుంది.