మోకాళ్ళనొప్పులు, నడుమునొప్పులు తగ్గించే పల్లీల నువ్వుల లడ్డు.. బాడీలో హీట్ కూడా పరార్

Updated on: May 03, 2026 | 3:43 PM

Peanut sesame laddu benefits in telugu: పల్లీల నువ్వుల లడ్డు.. వీటిని మీ ఇంట్లో చేసుకుని తింటే శరీరంలో ఉన్న వేడి కూడా తగ్గుతుంది. మోకాళ్ళనొప్పులు, నడుమునొప్పులు తగ్గుతాయి. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
పల్లీల నువ్వుల లడ్డు చేయడానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు పల్లీలు,  అర కప్పు తెల్ల నువ్వులు,  అర కప్పు నల్ల నువ్వులు, 
అర కప్పు బెల్లం తురుము , ఒక కప్పు వేయించిన పల్లీలు,  ఒక టేబుల్ స్పూన్ యాలకల పొడి,   ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక గ్లాస్ నీళ్లను తీసుకోవాలి. సరైన కొలతలతో చేసుకుంటే రుచిగా ఉంటాయి.

పల్లీల నువ్వుల లడ్డు చేయడానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు పల్లీలు, అర కప్పు తెల్ల నువ్వులు, అర కప్పు నల్ల నువ్వులు, అర కప్పు బెల్లం తురుము , ఒక కప్పు వేయించిన పల్లీలు, ఒక టేబుల్ స్పూన్ యాలకల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక గ్లాస్ నీళ్లను తీసుకోవాలి. సరైన కొలతలతో చేసుకుంటే రుచిగా ఉంటాయి.

2 / 5
పల్లీల నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలంటే? 
ముందుగా పల్లీలు ఇలా వేయించాలి: ఇప్పుడు  గ్యాస్ వెలిగించి పాన్‌ పెట్టి అది వేడయ్యాక దానిలో  పల్లీలను వేసి  మీడియం మంటపై గోల్డ్  రంగులోకి మారే వరకు బాగా వేయించాలి. ఇవి చల్లారాక పొట్టు తీసి మిక్సీలో వేసి మరి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

పల్లీల నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలంటే? ముందుగా పల్లీలు ఇలా వేయించాలి: ఇప్పుడు గ్యాస్ వెలిగించి పాన్‌ పెట్టి అది వేడయ్యాక దానిలో పల్లీలను వేసి మీడియం మంటపై గోల్డ్ రంగులోకి మారే వరకు బాగా వేయించాలి. ఇవి చల్లారాక పొట్టు తీసి మిక్సీలో వేసి మరి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

3 / 5

నువ్వులు ఇలా వేయించాలి: మళ్ళీ పాన్‌ ను గ్యాస్ మీద పెట్టుకుని తెల్ల నువ్వులను వేసి మీడియం మంటపై వ్ వాటిని  బాగా  వేయించాలి. ఆ తర్వాత దానిలో నల్ల నువ్వులను  వేసి వాటిని  కూడా అలాగే వేయించి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. మరి,నల్లగా వీటిని వేయించకండి.

4 / 5

బెల్లం పాకం  ఇలా చేసుకోవాలి:  ఆ తర్వాత మళ్ళీ పాన్ పెట్టి దానిలో కొద్దిగా బెల్లం తురుము వేసి అలాగే  నీటిని  కూడా పోసి  బాగా కరిగించాలి. ఈ పాకం బాగా మరిగే వరకు వాటిని   పొయ్యి మీదే ఉంచి  వాటిని బాగా వేయించాలి. అలా  అని  మరి ముదురు  పాకం అస్సలు పట్టుకోకండి. అలా చేస్తే ఉండ రాదు.

5 / 5
నువ్వుల మిశ్రమంలో దీనిని కలపాలి: బెల్లం పాకం తీసుకుని దానిలో పల్లీల పొడి, నువ్వులు, యాలకల పొడి వేసి మిక్స్ అయ్యేలా   కలపాలి. చివర్లో నెయ్యి కూడా  వేసి చిన్న   ఉండలుగా చేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు నెయ్యి రాసుకుని లడ్డూలుగా చేసి  ఫ్యాన్  కింద పెట్టుకోవడమే. వీటిని  తింటే, మోకాళ్ళనొప్పులు, నడుమునొప్పులు తగ్గుతాయి. అలాగే, శరీరంలో ఉన్న  వేడి కూడా తగ్గుతుంది.

Follow Us