Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ మెడల్స్ వెరీ వెరీ స్పెషల్.. ఒకొక్క పతకం ధర ఎంతో తెలుసా..
ఒలింపిక్స్ 33వ ఎడిషన్ జూలై 26 నుంచి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో అధికారికంగా ప్రారంభం కానున్నాయి. వేసవి ఒలిపింక్స్ క్రీడలు ఆగష్టు 11 వరకూ ఫ్రాన్స్‌లోని 16 వేర్వేరు నగరాల్లో జరగనున్నాయి. అయితే ఫ్రాన్స్‌లో కొన్ని క్రీడలు రెండు రోజుల మందే అంటే జూలై 24 నుండి ప్రారంభమవుతాయి. ఈ ఒలింపిక్స్ క్రీడల్లో 10000 మందికి పైగా అథ్లెట్లు వివిధ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహణ కోసం ఏర్పాట్లు భారీగా పూర్తి చేశారు. అంతేకాదు పతకాలను అందుకునే క్రీడాకారులకు పతకాలను అందజేయడానికి సుమారు 5084 పతకాలను రెడీ చేశారు. అలాగే ఈ స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహణ కోసం 61,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.