Parenting Tips: తల్లిదండ్రులూ బీ అలర్ట్.. మీరు చేసే ఈ తప్పులు పిల్లల డిప్రెషన్‌కు కారణాలవుతాయి..!

Updated on: Mar 02, 2023 | 1:13 PM

తల్లిదండ్రులు అవ్వటం అనేది ఒక వివాహిత జంటకు వరం. ఇది జీవితంలో గొప్ప ఆనందాల్లో ఒకటి. అయితే, తల్లిదండ్రులుగా పిల్లల బాధ్యతను నిర్వర్తించడం చాలా కష్టం. కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసే పొరపాట్లు, అలవాట్లు.. పిల్లలను డిప్రెషన్‌కు గురిచేస్తాయి.

1 / 8
సామర్థ్యానికి మించి పనిభారం: ప్రతి బిడ్డకు తన ప్రత్యేక లక్షణం ఉంటుంది. వారి సామర్థ్యం కంటే ఎక్కువ పని ఇవ్వడం ద్వారా వారిని మరింత బలహీనపరిచినవారవుతారు. తద్వారా వారు తీవ్ర నిరాశకు గురవుతారు.

2 / 8
నిరంతర పర్యవేక్షణ: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టరు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను 24 గంటలు పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఒకరకమైన ఆత్మన్యూనతాభావం కలుగుతుంది. అది వారిని కుంగదీస్తుంది.

3 / 8
కఠినమైన రూల్స్: కొందరు తల్లిదండ్రులు క్రమశిక్షణ పేరుతో తమ పిల్లలపై కఠినమైన ఆంక్షలు విధిస్తారు. నియమాలు పెడతారు. అవి వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. మానిసికంగా గందరగోళానికి గురవుతారు. అందుకే ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

4 / 8
పోలిక: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరులతో పోల్చుతారు. అలా చేయొద్దు. ఎందుకంటే.. ఎవరి సామర్థ్యం వారిది. పోలుస్తూ చూడటం వల్ల.. పిల్లలు మరింత నిరాశకు గురవుతుంటారు.

5 / 8
షరతులతో కూడిన ప్రేమ: చాలామంది తల్లిదండ్రులు పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన, మంచి ప్రతిభ కలిగిన పిల్లలపై ఎక్కువ ప్రేమ చూపుతారు. అలా చేయడం వల్ల మరో బిడ్డ డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.

6 / 8
పిల్లలతో స్నేహంగా ఉండాలి: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు పెరిగేకొద్దీ వారిపై ఒత్తిడి పెంచుతూనే ఉంటారు. బిడ్డ క్రమంగా ఎదుగుతున్నప్పుడు.. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహితుడిలా మెలగడం అలవాటు చేసుకోవాలి.

7 / 8
మానసికంగా నిర్లక్ష్యం: కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు ఆహారం, నీరు వంటి ప్రాథమిక అవసరాలను అందించడం తమ బాధ్యతగా భావిస్తారు. పిల్లలతో మానసికంగా కనెక్ట్ అవ్వరు. ఇతర పనులలో బిజీగా ఉంటారు. అలా ఉండకుండా.. పిల్లలను మానసికంగా కూడా దగ్గరకు తీసుకోవాలి. వారిపై ప్రేమ చూపించాలి.

8 / 8
కష్ట సమయాల్లో సహాయం చేయాలి: చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను వారి అభివృద్ధి కోసం కష్ట సమయాల్లో ఒంటరిగా వదిలివేస్తారు. అయితే, కొన్నిసార్లు ఇది పిల్లలపై దుష్ర్పభావం చూపుతుంది. అలా కాకుండా సమస్య పరిష్కారం కోసం కష్ట సమయాల్లో కాస్త భరోసా ఇవ్వాలి.