
పామ్ జుమేరా ఐలాండ్‌లో దాదాపు 2200 చదరపు అడుగుల విస్తీర్ణంలో పెంట్ హౌస్ నిర్మిస్తున్నారు. విశేషమేమిటంటే పెంట్ హౌస్ కట్టకముందే కొనుగోలుదారుల మధ్య పోటీ నెలకొంది. ఓ వ్యక్తి పెంట్ హౌస్‌ను రూ.1134 కోట్లకు కొనుగోలు చేశాడు. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఇదే అత్యంత ఖరీదైన పెంట్‌హౌస్.

పామ్ జుమేరాలో నిర్మిస్తున్న ఈ అపార్ట్‌మెంట్‌లో 2 BHK నుంచి 5 BHK వరకు ఫ్లాట్‌లు ఉన్నాయి. ఇది దుబాయ్‌లోని విలాసవంతమైన అపార్ట్‌మెంట్లలో ఒకటి. పామ్ జుమేరాకు నీటిపై తేలియాడే నగరం అని పేరు. విశేషమేమిటంటే ఈ ద్వీప నిర్మాణానికి మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాకు చెందిన రాళ్లను ఉపయోగించారు.

అపార్ట్‌మెంట్‌లోని 71వ అంతస్తులో ఐదు పడక గదుల పెంట్‌హౌస్‌ను నిర్మిస్తున్నారు. ఈ ద్వీపంలో విల్లాలు, విలాసవంతమైన హోటళ్లు ఉంటాయి. జుమేరా ఐలాండ్‌ను కృత్రిమంగా నిర్మించారు.

పామ్ జుమేరాలో నిర్మించే ఫ్లాట్ ధర ఎంతంటే.. సాధారణ ఫ్లాట్ ధర రూ.56 లక్షలు కాగా, 6 బెడ్ రూమ్ ఫ్లాట్ ధర రూ.40 కోట్ల వరకు ఉంది.

అనేక మంది భారతీయ పారిశ్రామికవేత్తలకు పామ్ జుమేరా ఐలాండ్‌లో కూడా ఆస్తులు ఉన్నాయి. ఈ ద్వీపం తాటి చెట్టు ఆకారంలో ఉంటుంది. దాదాపు 21 సంవత్సరాల క్రితం ఈ ఐలాండ్‌ను నిర్మించారు. ఇక్కడ ప్రజలు దాదాపు 14 సంవత్సరాల క్రితం అంటే 2007 సంవత్సరం నుంచి నివసించడం ప్రారంభించారు.