Health Tips: వైద్యుల సలహా లేకుండానే పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నారా..? తస్మాత్ జాగ్రత్త.. ముందుగా గుండెకే ప్రమాదం..!

|

Sep 20, 2023 | 1:31 PM

Pain Killer Side Effects: చాలా మంది తలనొప్పి, కడుపు నొప్పి వంటి చిన్న చిన్న సమస్యలకు కూడా పెయిన్ కిల్లర్స్ ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు  చెబుతున్నారు. డోసేజ్ విషయంలో వైద్యుల సలహా లేకుండా తీసుకుంటే గుండెకు కూడా ప్రమాదం తప్పదని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. 

1 / 5
డెన్మార్క్‌కి చెందిన కోపెన్‌హాగన్ యూనివర్శిటీ హాస్పిటల్ పరిశోధకులు పెయిన్ కిల్లర్స్‌ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల గుండెపోటు మరణాల ప్రమాదం పెరుగుతుందని కనుగొన్నారు. పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల గుండెపోటు సంభవించేందుకు 59 శాతం అవకాశాలు పెరుగుతున్నాయని వారు తెలిపారు. ఈ క్రమంలో పెయిన్  కిల్లర్స్ కారణంగా ఆరోగ్యంపై ఏయే ప్రభావాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.. 

2 / 5
గుండె సమస్యలు: పెయిన్ కిల్లర్ కారణంగా హార్ట్ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆయా నివేదిక ప్రకారం పెయిన్ కిల్లర్స్‌లోని రసాయనాలు నేరుగా రక్తంలో కలవడం వల్ల బీపీ, గుండెపోటు సమస్యలు కూడా పెరుగుతాయి.

3 / 5
కాలేయానికి హాని: ఆరోగ్య సమస్య ఉందని మనం తీసుకునే కొన్ని రకాల మందులు కాలేయానికి హాని చేయవచ్చు. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్‌లోని విష పదార్థాలు కాలేయంలో పేరుకుపోయి ప్రాణాంతంక పరిస్థితులకు దారితీస్తుంది. 

4 / 5
జీర్ణ వ్యవస్థపై ప్రభావం: పెయిన్ కిల్సర్స్‌ని అతిగా వాడడం వల్ల జీర్ణ వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. ఫలితంగా జీర్ణక్రియ రేటు తగ్గిపోవడమే మలబద్ధకం, ఉబ్బరం, అపానవాయువు, హేమోరాయిడ్లకు దారితీస్తుంది.

5 / 5
రోగనిరోధక శక్తిపై దుష్ప్రభావం: పెయిన్ కిల్లర్స్ నొప్పి నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగించినా, తదనంతరం దీర్ఘకాలం పాటు శరీరంపై దుష్ప్రభావాలను చూపిస్తాయి. ఈ క్రమంలో శరీర రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఫలితంగా సీజనల్ వ్యాధుల నుంచి శరీరం తన రక్షణ కవచాన్ని కోల్పోతుంది. 