కొన్ని సూపర్‌ఫుడ్స్ శరీరం రోగనిరోధక శక్తిని, శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. ఎముకల ఆరోగ్యం కోసం రోజువారీ తినే ఆహారంలో కాల్షియం ఉంచే విధంగా చూసుకోవాలి. ఎముకలు, మోకాళ్ల , వెన్నె నొప్పితో బాధపడుతుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోవాలి.
మానవ అస్థిపంజరం అనేది వివిధ రకాల ఎముకలతో కూడిన సంక్లిష్టమైన నిర్మాణం.. నడక నుంచి పరుగు వరకు నిటారుగా కూర్చోవడం వరకూ ప్రతిదీ ఎముకల బలం మీద ఆధారపడి ఉంటుంది. ఎముకలు ఆరోగ్యంగా లేకుంటే శరీరం కదలికలో ఇబ్బంది ఏర్పడుతుంది.
వయస్సుతో పాటు కాళ్ళు, తుంటి ఎముకలు క్షీణించడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా మహిళలకు 40 ఏళ్లు రాగానే మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. కనుక ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే విటమిన్ సి, డి, కాల్షియంపై ఆధారపడి ఉంటుంది. కనుక ఆ ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి.
పాలు, పాల ఉత్పత్తులు (నెయ్యి, చీజ్, పనీర్ మొదలైనవి) కాల్షియంలో పుష్కలంగా ఉంటాయి. కనుక ఎముకలు దృఢంగా ఉండాలంటే వాటిని రోజువారీ ఆహారంలో ఉంచుకోండి
నిమ్మ, టొమాటో మరియు పచ్చిమిర్చి, క్యాప్సికం, పాల కూరలతో పాటు సిట్రస్ పండ్లలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. కనుక ఖచ్చితంగా వాటిని తినే ఆహారంలో ఉండేలా చూసుకోండి.
ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో మెగ్నీషియం కూడా ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది. కనుక మెగ్నీషియం (బ్రోకలీ, గుమ్మడి గింజలు, అరటిపండ్లు) అధికంగా ఉండే ఆహారాన్ని తినండి.
ప్రోటీన్, విటమిన్-బి12, విటమిన్-కె , జింక్ కూడా ఎముకల నిర్మాణానికి సహకరిస్తాయి. కాబట్టి ప్రొటీన్లు, విటమిన్లు (చేపలు, మాంసం, గుడ్లు, మొలకెత్తిన విత్తనాలు, బ్రోకలీ, బచ్చలికూర) అధికంగా ఉండే ఆహారాన్ని తినండి.
విటమిన్ డి సూర్యకాంతిలో మాత్రమే లభిస్తుంది. కనుక ప్రతిరోజూ సూర్యరశ్మి తగిలే విధంగా చూసుకోండి. అలాగే నడక, పరుగు, ఈత, వ్యాయామం చేయండి. అప్పుడు ఎముకలకు రక్తప్రసరణ బాగా జరిగి ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.