
వేసవిలో శరీరానికి చలువ చేసే సమ్మర్ డ్రింక్స్‌లో బెల్లం సబ్జా డ్రింక్ కుడి ఒకటి. ఇది కేవలం ఒక పానీయమే కాకుండా.. టేస్ట్ కూడా అద్భుతం అంతే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇంకా సబ్జా గింజలు బాడీలో హీట్ తగ్గించి చల్లబరచేలా చేస్తుంది. ఇంకా బెల్లంలో ఉండే పోషకాలు శక్తిని కూడా అందిస్తుంది. అయితే, దీనినే మధ్యాహ్నం వేళల్లో తాగితే అలసట తగ్గి రిఫ్రెష్‌గా ఉంటుంది.

బెల్లం సబ్జా డ్రింక్ కు కావాల్సిన పదార్థాలు: మూడు టేబుల్ స్పూన్లు సబ్జా గింజలు, అర కప్పు బెల్లం, నాలుగు చల్లటి నీరు – 3 నుంచి 4 గ్లాసులు , రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం , ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక కప్పు ఐస్ క్యూబ్స్ , రుచి కోసం నాలుగు తులసి ఆకులు లేదా కొద్దిగా పుదీనా తీసుకుని చివర్లో వేస్తె చాలు.

బెల్లం సబ్జా డ్రింక్ రెసిపీ తయారీ విధానం: ముందుగా సబ్జా గింజలను తీసుకుని ఒక గిన్నెలో తగినంత నీళ్ళు పోసి 20నుంచి 25 నిమిషాల పాటు వీటిని బాగా నానబెట్టాలి. అయితే, ఇవి కొద్దిసేపటికి ఉబ్బి జెల్లీలా అవుతాయి. ఇప్పుడు ఇంకో పాత్రలో బెల్లం తీసుకుని గోరువెచ్చని నీటిలో వేసి వీటిని కరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని వంపి పక్కన పెట్టాలి.

ఇప్పుడు ఒక పాత్రలో చల్లటి నీరు దానిలో బెల్లం నీళ్లు కలపాలి. కొద్దీ సేపటి తర్వాత సబ్జా గింజలు వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, యాలకుల పొడి వేసుకుంటే టేస్ట్ తో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. చివర్లో చివరగా ఐస్ క్యూబ్స్ కూడా వేసి వీటిని చల్లగా సర్వ్ చేసుకోవాలి. ఇంకా ఈ డ్రింక్ లో పుదీనా లేదా తులసి ఆకులు వేసుకోవచ్చు.

ఈ డ్రింక్ తాగితే ఎన్నో లాభాలు: ఒక్క గ్లాస్ తాగితే శరీరానికి చలువ చేస్తుంది ఇంకా డీహైడ్రేషన్ సమస్య కూడా తగ్గుతుంది అలాగే, ఇమ్యూనిటీ పవర్ కూడా పెరిగి బాడీకి వెంటనే శక్తిని అందిస్తుంది అంతే కాదు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఈ డ్రింక్ ను సమ్మర్లో తాగితే వేసవిలో వచ్చే అలసట మొత్తాన్ని తగ్గిస్తుంది.