Ola Electric Scooter: వాహనదారులకు షాకిచ్చిన ఓలా.. ఎలక్ట్రిక్ స్కూటర్ మరింత ప్రియం
Ola Electric Scooter: ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు, వాహనాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రజల ఆదాయం పెరగడం లేదు గానీ.. ఖర్చులు మాత్రం ..
Ola Electric Scooter: ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు, వాహనాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రజల ఆదాయం పెరగడం లేదు గానీ.. ఖర్చులు మాత్రం పెరిగిపోతున్నాయి. ఏ వస్తువు కొనాలన్నా తడిసి మోపెడవుతోంది.
ఇక ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా.. కొనుగోలుదారులకు షాకిచ్చింది. కంపెనీకి చెందిన ఎస్1 ప్రో ధరను రూ.10 వేలు పెంచుతున్నట్లు ప్రకటించింది.
గత రెండు విడుతలుగా ధరల్లో ఎలాంటి మార్పులు చేయని సంస్థ.. మూడో విడుత మాత్రం ఎస్1 ప్రో మోడల్ ధరను పెంచేసింది. ధరలు పెంచడానికి గల కారణాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు.
దేశంలో ఎస్1 ప్రో మోడల్ ధర రూ.1.40 లక్షలకు చేరుకొంది. గతంలో ఈ స్కూటర్ ధర రూ.1.30 లక్షలుగా ఉండేది. గతేడాది ఆగస్టులో ఈవీల విభాగంలోకి అడుగుపెట్టిన తర్వాత ధరలు పెంచడం ఇదే మొదటిసారి.