Kitchen Hacks: గోడపై పడ్డ ఆయిల్ మరకల్ని ఇలా ఈజీగా పోగొట్టుకోవచ్చు..

Updated on: Jan 24, 2025 | 1:54 PM

ప్రస్తుత కాలంలో ఇంటికి ఎంతో ఖరీదైన పెయింట్స్‌ని వేయిస్తూ ఉంటున్నారు. అయితే ఒక్కోసారి అనుకోకుండా ఇంట్లోని గోడలపై ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి. ఈ ఆయిల్ మరకలు అంత సులభంగా పోవు. కానీ ఇలా ట్రై చేశారంటే ఖచ్చితంగా గోడపై పడ్డ ఆయిల్ మరకలు ఈజీగా పోతాయి..

1 / 5
సాధారణంగా ఇంట్లో లేదా బయట ఉన్న గోడలపై అనేక మరకలు పడుతూ ఉంటాయి. కర్రీలు వంటి లేదా ఇతర మరకల్ని ఎలాగోలా వదిలించుకోవచ్చు. కానీ ఆయిల్ మరకలు అంత తేలిగ్గా పోవు. మళ్లీ పెయింట్ వేయాల్సిందేనని బాధ పడుతూ ఉంటారు.

2 / 5
కానీ ఈ చిట్కాలను ట్రై చేశారంటే ఖచ్చితంగా ఆయిల్ మరకల్ని వదిలించుకోవచ్చు. గోడపై పడ్డ ఆయిల్ మరకల్ని వదిలించడంలో వెనిగర్ ఎంతో చక్కగా సహాయ పడుతుంది.

3 / 5
ముందుగా మీ ఇంట్లో ఉన్న ఏదో ఒక పిండిని.. గోడలపై చల్లండి. ఓ పావు గంట సేపు పక్కకు వదిలేయండి. అలా చల్లడం వల్ల పిండి నూనెను గ్రహిస్తుంది.

4 / 5
ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా నీరు, వైట్ వెనిగర్ కలిపి మిక్స్ చేయండి. స్పాంజ్ లేదా సాఫ్ట్‌గా ఉండే ఒక క్లాత్ తీసుకుని నీటిలో ముంచి గోడలపై రుద్దండి. ఇలా చేస్తే గోడలపై నూనె మరకలు పోతాయి.

5 / 5
అదే విధంగా బేకింగ్ సోడాతో కూడా నూనె మరకల్ని వదిలించుకోవచ్చు. గోరు వెచ్చని నీటిలో కొద్దిగా డిటర్జెంట్ లిక్విడ్ లేదా పౌడర్, బేకింగ్ సోడా వేసి మిక్స్ చేసి.. ఓ క్లాత్‌తో తుడిస్తే ఆయిల్ మరకలు పోతాయి.