Health risks of obesity: అధిక బరువును తక్కువగా అంచనా వేయకండి! జాగ్రత్త.. స్లీప్ అప్నియా, బ్రెయిన్‌ స్ట్రోక్ ఇంకా..

|

Mar 05, 2022 | 8:01 PM

ఈ రోజుల్లో అందరినీ వేధిస్తోన్న కామన్‌ ప్రోబ్లెం.. అధిక బరువు (overweight). జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా బరువు పెరగడం ఆ తర్వాత అది ఊబకాయానికి దారితీయడం వెంటవెంటనే జరిగిపోతున్నాయి. నిజానికి ఊబకాయం అనేది ఒక వ్యక్తి శరీరంలో హానికరమైన కొవ్వుల (harmful fats) పరిమాణం ..

1 / 6
Health risks of obesity in Children: ఈ రోజుల్లో అందరినీ వేధిస్తోన్న కామన్‌ ప్రోబ్లెం.. అధిక బరువు (overweight). జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా బరువు పెరగడం ఆ తర్వాత అది ఊబకాయానికి దారితీయడం వెంటవెంటనే జరిగిపోతున్నాయి. నిజానికి ఊబకాయం అనేది ఒక వ్యక్తి శరీరంలో హానికరమైన కొవ్వుల (harmful fats) పరిమాణం పెరిగే స్థితిని బట్టి వస్తుంది. ఊబకాయం వెన్నంటే ఎన్నో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. శరీరంలోని ఈ హానికర కొవ్వులు ఎముకలు, ఇతర అవయవాలపై ఒత్తిడిని పెంచుతాయి.

2 / 6
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారని పరిశోధనలు తెల్పుతున్నాయి. వీరి బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 30, అంతకంటే కూడా ఎక్కువగా ఉంటుంది.

3 / 6
స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదం కూడా ఎక్కువే. సాధారణంగా మెదడుకు రక్త సరఫరా ఆగిపోయినప్పుడు స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ వల్ల మెదడు కణజాలాలకు నష్టం వాటిల్లుతుంది. స్ట్రోక్ పలు వైకల్యాలకు దారి తీస్తుంది. అంటే మాట్లాడటంలో ఇబ్బంది, బలహీనమైన కండరాలు, ఆలోచనలు తార్కిక నైపుణ్యాల్లో మార్పులు చోటుచేసుకుంటాయన్నమాట. 2.3 మిలియన్ల మందిపై చేసిన వివిధ పరిశోధనల్లో  తేలిదేమిటంటే.. ఊబకాయం స్ట్రోక్ ప్రమాదాన్ని 64 శాతం పెంచిందని వెల్లడైంది.

4 / 6
లెజెండరీ ఆర్టిస్ట్ బప్పి లాహిరి ఇటీవల స్లీప్ అప్నియా అనే వ్యాధితో మరణించిన విషయం తెలిసిందే. స్లీప్ అప్నియా అంటే.. నిద్రిస్తున్న సమయంలో హఠాత్తుగా శ్వాస ఆగిపోయి, మృతి చెందడాన్ని స్లీప్ అప్నియా అంటారు. అధిక బరువు, ఊబకాయం వ్యక్తుల్లో స్లీప్ అప్నియా ప్రమాదం ఎక్కువ.

5 / 6
ఊబకాయం వల్ల కాలేయానికి (Liver) కూడా ప్రమాదమే. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి అధిక బరువు ఉన్నవారిలో వస్తుంది. కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోయినప్పుడు ఇది జరుగుతుంది. అధిక కొవ్వు కాలేయాన్ని దెబ్బతీస్తుంది.

6 / 6
ఇది టైప్ 2 డయాబెటిస్‌కు కూడా దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉంటే టైప్ 2 మధుమేహం వస్తుంది. కాలక్రమేణా ఇది గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు, కంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఊబకాయం మధుమేహం ముప్పును 5-6 శాతం పెంచుతుంది. శరీర బరువును నియంత్రణలో ఉంచడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి అలవాట్లవల్ల టైప్ 2 డయాబెటిస్‌ రాకుండా నివారించవచ్చు.