సిబిల్‌ స్కోర్ లేదా.. టెన్షనొద్దు.. ఇలా సింపుల్‌గా క్రెడిట్ కార్డుతోపాటు లోన్స్ కూడా పొందండి!

Updated on: Aug 10, 2026 | 11:04 AM

How to get a credit card without a credit score: పెరుగుతున్న ధరలు, నెలవారి ఖర్చులు, హాస్పిటల్స్ ఖర్చులు ఇవన్నీ.. ఒక్క నెలవారి జీతంతో మెయింటేన్ చేయడం సాధ్యం కాదు. ఇలాంటప్పుడే క్రెడిట్‌ కార్డు ఎంతో అవసరమవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు పొందడం చాలా కష్టతరంగా మారింది. నెల నెలా కరెక్ట్‌ జీతం వస్తున్నా.. బ్యాంకులు మాత్రం క్రెడిట్ కార్డు అప్లికేషన్స్‌ను రిజెక్ట్ చేస్తున్నాయి. దీనికి అసలు కారణం ఏంటి సిబిల్ స్కోర్ లేకపోవడం. మరి సిబిల్ ఏకున్నా లోన్స్, క్రెడిట్ కార్డు తీసుకోవడం సాధ్యమవుతుందా.. అంటే ఉంది. అదెలానో చూద్దాం.

1 / 5
మీరు మంచి జీతం పొందుతున్నప్పటికీ, మీకు లోన్స్ ఇవ్వాలన్నా.. క్రెడిట్ కార్డులు ఇవ్వాలన్నా.. బ్యాంకులు మీ ఆదాయాన్ని మాత్రమే కాక మీ తీసుకున్న లోన్స్‌ను ఎలా కడుతున్నారనేదాన్ని చూస్తాయి. కాబట్టి మీరు లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు.. తొలుత మీ క్రెడిట్ హిస్టరీని చూస్తాయి. మీరు గతంలో ఎలాంటి లోన్స్ తీసుకొనట్లయితే.. అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ అనేది నిల్‌గా చూపిస్తుంది. దీంతో బ్యాంకులు మీ దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంటుంది.

2 / 5
కాబట్టి మీరు క్రెడిట్ హిస్టరిని పెంచుకోవాలి. ఇందుకోసం మీరు మొదట్లోనే పెద్ద పర్సనల్ లోన్స్ కోసం ప్రయత్నించకుండా, ఫిక్స్డ్ డిపాజిట్ (FD) ఆధారిత సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి. లేదా ఇంట్లోకి అవసరమైన వస్తువులను EMI ల ద్వారా కొనుగోలు చేసి, క్రమం తప్పకుండా చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్‌ను పెరుగుతుంది. మీ క్రెడిట్ స్కోర్ 700 లేదా 750 దాని కంటే పైనే ఉండేలా చూసుకోవాలి.. ఇలా ఉంటేనే మీకు లోన్స్ వస్తాయి.

3 / 5
మీరు క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత దాన్ని వాడే విధానం కూడా మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. కాబట్టి దాన్ని ఎలా వాడాలో తెలుసుకోవడం ముఖ్యం. తొలి రోజుల్లో మీరు మీ క్రెడిట్ కార్డ్ లిమిట్‌లో 25శాతం మాత్రమే ఉపయోగించడం ఉత్తమం. ఒకేసారి పలు బ్యాంకులు లేదా యాప్‌లలో రుణాల కోసం దరఖాస్తు చేయకూడదు. కార్డ్‌లను ఎక్కువ కాలం కొనసాగించడం వల్ల మీ క్రెడిట్ హిస్టరీ బలపడుతుంది. అలాగే మీ నెలవారీ అప్పుల బిల్లుల చెల్లింపులు మీ మొత్తం ఆదాయంలో 50% దాటకుండా చూసుకోవాలి.

4 / 5
ఇవన్ని మీరు సరిగ్గా పాటిస్తే.. అప్పుడు మీ క్రెడిట్‌ స్కోర్ పెరగడం స్టార్ట్ అవుతుంది. మొదటి మూడు నెలల్లో స్కోర్ రూపుదిద్దుకోవడం ప్రారంభమవుతుంది. 6 నెలలు వచ్చేసరికి వినియోగానికి తగిన విధంగా స్కోర్ తయారవుతుంది. ఇక 9 నుండి 12 నెలలుకు క్రమశిక్షణతో కూడిన చెల్లింపులు చేస్తే ఒక బలమైన క్రెడిట్ ప్రొఫైల్ ఏర్పడుతుంది.

5 / 5
మొత్తంగా క్రెడిట్ అనేది కేవలం ఒక ఫైనాన్షియల్ ప్రొడక్ట్ కాదు, అది మీ ఆర్థిక వ్యక్తిత్వం. చిన్న చిన్న రుణాలను సరైన సమయంలో చెల్లిస్తూ, సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో సులభంగా పెద్ద రుణాలు పొందవచ్చు. ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే.. మీకు క్రెడిట్ స్కోర్ లేకండానే లోన్స్ పొందవచ్చు.. అలాగే క్రెడిట్ స్కోర్ కూడా పెంచుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us