తత్కాల్ టికెట్లు స్పీడ్‌గా బుక్ కావాలా..? ఈ యాప్‌తో సులువు..
Venkatrao Lella
Images: Pinterest
29 August 2026
ట్రైన్లలో అత్యవసర ప్రయాణం చేయాలనుకున్నప్పుడు అందరికీ గుర్తొచ్చేది తత్కాల్ టికెట్లు. ఈ టికెట్లు పొందేందుకు ఉదయం 10, 11 గంటల మధ్య ప్రయాణికులు పోటీ పడుతుంటారు. టికెట్ దక్కితే అదృష్టంగా భావిస్తారు.
గతంలో IRCTC రైల్ కనెక్ట్ యాప్ ద్వారా తత్కాల్ టికెట్లను బుక్ చేసుకునేవారు. అయితే ఇప్పుడు రైల్ వన్ అనే మరో యాప్ వచ్చింది. ఈ రెండింటిల్లో ఏది మంచిది?
రైల్ వన్‌ను సూపర్ యాప్‌గా పిలుస్తున్నారు. రిజర్వేషన్ టిక్కెట్లు, సాధారణ టిక్కెట్లు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ట్రైన్ లొకేషన్ లైవ్ ట్రాకింగ్, PNR స్టేటస్ తెలుసుకోవచ్చు.
ఇక రైల్ వన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయడం, రైల్వే సమస్యలపై ఫిర్యాదు చేయడం లాంటివి చేయవచ్చు. ఈ ఒక్క యాప్ అన్ని పనులను నిర్వహిస్తుంది.
IRCTC రైల్ కనెక్ట్ యాప్ ద్వారా కూడా రిజర్వుడ్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. రైలు షెడ్యూళ్లను చూడవచ్చు. బుక్ చేసుకున్న టిక్కెట్లను రద్దు చేసుకోవచ్చు.
తత్కాల్ టిక్కెట్ల బుకింగ్‌కు సంబంధించి టైమ్ వృథా కాకుండా ఉండేందుకు "మాస్టర్ లిస్ట్" ఫీచర్ ఈ రెండు యాప్స్‌లోనూ అందుబాటులో ఉంది.
అయితే పేమెంట్ విషయంలో రైల్‌వన్ యాప్ వేగవంతంగా పూర్తి చేయొచ్చు. ఈ యాప్‌లో వాలెట్ ఆప్షన్ ఉంది. మీ వాలెట్‌లో ఇప్పటికే తగినంత బ్యాలెన్స్ ఉంటే ఓటీపీలు లేకుండా పేమెంట్ చేయవచ్చు.
ఈ ఫీచర్ IRCTC యాప్‌లో అందుబాటులో లేదు. దీంతో ఈ యాప్‌లో బుకింగ్ పూర్తి చేయడానికి 10 నుండి 15 సెకన్లు ఎక్కువ సమయం పట్టవచ్చు.
తత్కాల్ టికెట్ల బుకింగ్‌లో ప్రతి క్షణం విలువైనది. రైల్ వన్ యాప్‌ని ఉపయోగించడం వల్ల త్వరగా టికెట్ బుక్ అయ్యే అవకాశం ఉంటుంది.