
ఈ ఏడాది చివరినాటికి దేశంలో అన్ని జాతీయ రహదారులపై ఎలాంటి గుంతలు లేకుండా చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఇందుకు.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకంగా విధి విధానాలను సిద్ధం చేస్తోందని పేర్కొన్నారు.

దేశంలో ఇదివరకే.. 1,46,000 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారుల మ్యాపింగ్ ప్రక్రియ పూరైనట్లు పేర్కొన్నారు. అలాగే త్వరలో రోడ్లపై గుంతలు పూడ్చడానికి అవసరమైనటువంటి.. నిర్వహణ ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు పేర్కొన్నారు వెల్లడించారు.

అలాగే మరికొద్దిరోజుల్లో నిర్మించబోయే రహదారుల నిర్మాణానికి బిల్ట్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (బీవోటీ) అనే పద్ధతిలో కాంట్రాక్టులు జారీ చేస్తామని పేర్కొన్నారు. అయితే ఈ విధానంలో చూసుకుంటే.. రహదారుల నిర్మాణం జరిగినట్లైతే ఎక్కువ కాలం మన్నిక ఉంటుందని వివరించారు.

ఇదిలా ఉండగా.. సాధారణంగా చూసుకుంటే రహదారుల నిర్మాణం అనేగి మూడు పద్ధతుల్లో జరుగుతుంది. అందులో ఒకటి బీవోటీ, రెండవది ఇంజినీరింగ్ - ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (EPC), ఇక మూడవది హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM). అయితే ఈపీసీ కింద నిర్మించినటువంటి రోడ్లకు తొందరగా.. నిర్వహణ చేపట్టాల్సిన అవసరం ఉంటుంది.

అలాగే బీవోటీ కింద నిర్మించినటువంటి వాటికి రాబోయే 15-20 సంవత్సరాల పాటు నిర్వహణ ఖర్చును గుత్తేదారు పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, నిర్వహణ కోసం ఖర్చు చేయాల్సినటువంటి మొత్తాన్ని కూడా గుత్తేదారు సమకూర్చాల్సిన అవసరం ఉంటుంది. కానీ.. ఈపీసీ విధానంలో రోడ్డు నిర్మాణం, నిర్వహణకు సంబంధించి అవసరమై ఖర్చును ప్రభుత్వం సమకూర్చాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఈ బీవోటీ పద్ధతిలో కాంట్రాక్టులు ఇవ్వాలని నిర్ణయించామని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.