Potato Peel Benefits : ఆలూ తొక్కలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?ఈ హ్యాక్స్ మీకు తెలిస్తే..

|

Sep 16, 2024 | 3:03 PM

ఆలూ తొక్కల్లో పోషకాలు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వాటిలోని పోషక విలువలకు ఇవి ప్రధాన కారణం. అందుకే బంగాళా దుంపల తొక్కలను చర్మ, సౌందర్య సాధానాల్లో వినియోగిస్తారు. వీటిని మీరు వివిధ రకాలుగా, వివిధ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ తొక్కలతో ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో.. ఎలాంటి హ్యాక్స్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
బంగాళదుంప తొక్కలో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి వంటి పోషకాలు చాలా ఉన్నాయి. వీటిని ఆహారంలో చేర్చుకుంటే ఈ పోషకాలు మనకు అందుతాయి. బంగాళదుంప తొక్కల్లో యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ ఉంటుంది. ఇది చిన్నపాటి కాలిన గాయాలకు చికిత్సను అందిస్తుంది.

2 / 5
వడదెబ్బ వంటి వాటికి సహజమైన నివారణగా బంగాళా దుంప పని చేస్తుంది. వడదెబ్బవల్ల ప్రభావితమైన చర్మాన్ని ఏకకాలంలో తేమగా మార్చగలిగే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్​గా పనిచేస్తుంది. కాలిన గాయాల నుంచి తక్షణమే ఉపశమనం అందిస్తుంది.

3 / 5
మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఆలూ తొక్కలను ఉపయోగించవచ్చు. డార్క్ సర్కిల్స్​ను తగ్గించడంలో కూడా మంచి ఫలితాలు అందిస్తుంది. బంగాళా దుంపల తొక్కలు, రసంతో మీరు మీ ముఖానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ఇది మీకు ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని అందిస్తుంది.

4 / 5
బంగాళా దుంప తొక్కలను కంపోస్ట్‌లో కలపవచ్చు. ఇది నత్రజని , పొటాషియం వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. మొక్కలకు మంచి ఎరువుగా మారుతుంది. బంగాళా దుంప తొక్కలను బూట్లు పాలిష్ చేయడానికి ఉపయోగించవచ్చు. మీ బూట్లపై తొక్కల లోపలి భాగాన్ని రుద్దడం వల్ల అవి మెరుస్తాయి.

5 / 5
ఈ బంగాళ దుంప తొక్కలతో మనం చాలా వస్తువులు శుభ్రం చేసుకోవచ్చు. ముఖ్యంగా వెండి పాత్రలు, తుప్పు పట్టిన పాత్రలను దీనితో రుద్దితో.. మళ్లీ కొత్త వాటిలా మెరుస్తాయి.  బంగాళా దుంప తొక్కలను మీ చర్మంపై రుద్దడం వల్ల ముఖం దురద, దద్దుర్లు లేదా కీటకాల కాటు నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది నల్లటి మచ్చలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.