
సాధారణంగా చాలా మంది సబ్బుతో బట్టలను ఉతుకుతుంటారు. కానీ జీన్స్ ఉతికేటప్పుడు మాత్రం మీరు ఈ పొరపాటును చేయకండి.ఎందుకంటే సబ్బుతో ఉతకడం వల్ల జీన్స్ రంగు త్వరగా పోయే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఉతుకు తర్వాత ప్రతి ఉతికిన తర్వాత అవి నిస్తేజంగా కనిపిస్తాయి.

మీ దగ్గర బ్లాక్ లేదా బ్లూ జీన్స్ ఉండి. అవి మీకు ఎక్కవకాలం లైఫ్ ఇవ్వాలనుకుంటే వాటిని ఉతికేటప్పుడు బయటవైపు నుంచి కాకుండా దాన్ని తోపలవైపునకు తిప్పి ఉతకండి. ఇలా చేయడం వల్ల మీ ప్యాంట్లు ఎక్కువశాతం కలర్‌పోకుండా ఉంటుంది. జీన్స్ రంగును కాపాడుకోవడానికి ఇది ఉత్తమమైన మార్గాలలో ఒకటి.

జీన్స్ కొన్న తర్వాత, ఒక లీటరు నీటిలో ఒక పెద్ద మూత తెల్ల వెనిగర్, ఒక గుప్పెడు ఉప్పు కలపండి.తరువాత జీన్స్‌ను ఈ నీటిలో రెండు నుండి మూడు గంటలు నానబెట్టండి.తర్వాత వాటిని సాధారణ నీటిలో పిండండి. ఇలా చేయడం ద్వారా క్లాత్‌పాడవుండా ఉంటుంది. కలర్ కూడా పోదు.

చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. బట్టలను సబ్బు, లేదా సర్ఫ్‌లో గంటల తరబడి నానబెట్టడం. ఇలా చేయడం ద్వారా అవి త్వరగా చివికిపోవచ్చు. కాబట్టి వాటిని డిటర్జెంట్‌లో అరగంట మాత్రమే నానబెట్టండి. అలాగే వాటిని తరచూ ఉతకడం చేయకండి.ఒక రోజు మార్చి ఒక రోజూ, లేదా వారంలో రెండు, సార్లు ఉతకండి.

మురికి త్వరగా పోవాలని కొంతమంది వేడి నీటిలో జీన్స్‌ను నానబెట్టి ఉతుకుతారు. ఇలా చేయడం ద్వారా వాటి మురికితో పాటు కలర్ కూడా పోతుంది కాబట్టి ఎప్పుడూ బట్టలను చల్లనీటిలో మాత్రమే ఉతకండి.(గమనిక:పైన పేర్కొన్న అంశాలు అవగాహన మేరకు మాత్రమే అందించబడినవి.. వీటిని పాటించే ముందు నిపుణులను సంప్రదించండి.