Vastu Tips: పొరపాటున కూడా ఈ మొక్కలను ఇంట్లొ పెంచకండి.. దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నట్టే..!

Updated on: Nov 22, 2025 | 7:21 PM

ఇంటి చుట్టూ ఉన్న వాతావరణాన్ని అందంగా ఉంచుకోవడం, పర్యావరణాన్ని తాజాగా ఉంచడానికి, చాలా మంది ఇంట్లో, ఇంటి పరిసరాల్లో వివిధ రకాల మొక్కలను నాటుతారు. పచ్చదనంతో నిండిన ఈ మొక్కలు సానుకూల శక్తిని వ్యాపింపజేస్తాయని వారు నమ్ముతారు. కానీ ఇలా నాటే కొన్ని మొక్కలు మన ఇంట్లో ప్రతికూలతను వ్యాపింపజేస్తాయి. కాబట్టి, ఇంట్లో ఏ మొక్కలను నాటకూడదో ఇక్కడ తెలుసుకోండి.

1 / 5
ప్రతి ఒక్కరూ ఇంటి చుట్టూ వివిధ రకాల మొక్కలను నాటుతారు ఎందుకంటే అవి ఇంటి వాతావరణాన్ని అందంగా తీర్చిదిద్దుతాయి. అలాగే ప్రశాంతంగా ఉంచుతాయి. ఈ మొక్కలు సానుకూల వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా మన మానసిక, శారీరక, ఆర్థిక శ్రేయస్సుపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. వాటిలో కొన్ని సానుకూల ప్రభావన్ని చూపితే.. మరికొన్ని ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఇంట్లో ఈ కింద పేర్కొన్న మొక్కలను అస్సలు నాటకండి.

2 / 5
 అకాసియా మొక్క: అకాసియా ఇదొక ముళ్ల మొక్క, కాబట్టి ఈ ముళ్ల మొక్కను ఇంట్లో నాటడం అంత మంచిదికాదు. ఈ మొక్క ఇంట్లో చికాకు,గొడవలు, ఉద్రిక్తతను పెంచుతుంది. అకాసియా సంబంధాల సామరస్యాన్ని నాశనం చేస్తుంది, మానసిక అశాంతిని పెంచుతుంది కాబట్టి ఈ మొక్కను నాటడం సరైనది కాదు.

3 / 5
 కాక్టస్: ఇది చూడ్డానికి అందంగా ఉందని.. చాలా మంది ఈ మొక్కను ఇంట్లో నాటుతారు. కానీ ఈ మొక్క ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, దాని ముళ్ళు ప్రతికూల శక్తికి చిహ్నంగా పరిగణించబడతాయి. ఇది ఇంట్లో ఉద్రిక్తత, సంఘర్షణకు దారితీస్తుంది. ఇది మానసిక ఒత్తిడి, ఆర్థిక నష్టాన్ని కూడా కలిగిస్తుంది.

4 / 5
మెహందీ మొక్క: ఈ మొక్క సువాసన, ప్రయోజనకరమైనది అయినప్పటికీ, ఇంటి దగ్గర ఈ మొక్కను నాటడం మంచిది కాదని చెబుతారు. ఎందుకంటే ఈ మొక్క ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది, ఇది ఆరోగ్య సంబంధిత సమస్యలను, ఇంట్లో అస్థిరతను కలిగిస్తుంది.

5 / 5
ఎండిన మొక్కలు: ఎండిన మొక్కలను ఇంట్లో ఉంచకూడదు. ఈ మొక్కలను ప్రతికూల శక్తికి చిహ్నంగా భావిస్తారు, ఇది ఇంటి సభ్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని మేము దృవీకరించట్లేదు.. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.

Follow Us