Anil kumar poka |
Feb 24, 2021 | 12:45 PM
సినీ పరిశ్రమలో టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ఆరంభించి.. అనుకోకుండా హీరోగా మారాడు ఈ హీరో. విలక్షణమైన నటనతోపాటు.. విభిన్న సినిమాలను చేయడం నాని స్టైల్.
నేచరల్ స్టార్‌గా పరిశ్రమలో తనదైన శైలీలో అలరిస్తూ దూసుకుపోతున్నాడు నాని.మొదట్లో నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అష్టా చమ్మా’ సినిమాతో పరిచయమయ్యాడు నాని.
ఇక ‘అష్టాచెమ్మా’తో మొదలైన నాని ప్రయాణం ఇటీవలే వచ్చిన ‘వి’ సినిమా వరకు ప్రేక్షకులను అలరిస్తునే ఉన్నాడు. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని వరుస ఆఫర్లను అందుకున్నాడు నేచురల్ స్టార్. ఇక ఆ తర్వాత రాజమౌళి సినిమాలోనే ఛాన్స్ కొట్టేసాడు. దర్శకధీరుడు నానిలోని టాలెంట్‌ను గుర్తించి తన ‘ఈగ’ చిత్రంలో ప్రధాన పాత్రనే అందించారు రాజమౌళి.
ఇక ఆ తర్వాత నాని ఒకే రోజున రెండు సినిమాలను విడుదల చేసే రేంజ్‌కు ఎదిగిపోయాడు. అదే క్రమంలో ఒకే రోజున “ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు” చిత్రాలను విడుదల చేశారంటేనే నాని రేంజ్ ఏలా మారిందో చెప్పుకోవచ్చు.
నానికి 2015 సంవత్సరంలో సినిమాలు భలేగా వచ్చాయి. అప్పుడే ఒకే రోజున రెండు సినిమాలు విడుదల చేసి అలరించాడు.. ఆ యేడాదిలో చివరగా విడుదలైన నాని ‘భలే భలే మగాడివోయ్’ టైటిల్‌కు తగ్గట్టుగానే అలరించింది.
వైవిధ్య కథాంశంతో తెరకెక్కిన ఆ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత విశ్వక్సేన్ హీరోగా ‘హిట్’ సినిమాను నిర్మించి ప్రశంసలు అందుకున్నాడు. నాని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పన్నెండేళ్ళ.
ఇప్పటి వరకు నాని 25 సినిమాలు పూర్తిచేశాడు.అతని మరో చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ సెట్స్ పై ఉంది. ఇవే కాకుండా మరిన్ని ఆఫర్లను అందుకుంటూ.. ప్రేక్షకులను అలంరిస్తూ ఉండాలి. నేచురల్ స్టార్ నానికి పుట్టిన రోజు శుభకాంక్షలు.