
జుట్టు రాలడం, జుట్టు తెల్లబడటం సమస్య ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే పెరుగుతోంది. నిద్ర లేకపోవడం, సరైన ఆహారం లేకపోవడం, పెరిగిన కాలుష్యం వంటి అనేక కారణాల వల్ల జుట్టు సమస్యలు పెరుగుతున్నాయి. ఈ కింది ఇంటి నివారణ చిట్కాలతో జుట్టు రాలడం సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చు.

షాకింగ్ విషయం ఏమిటంటే చాలా చిన్న వయసులోనే అబ్బాయిలతోపాటు అమ్మాయిలకు కూడా జుట్టు తెల్ల రంగులోకి మారుతుంది. దీనికి ప్రధాన కారణాలలో ఒకటి మొబైల్ ఫోన్లను నిరంతరం ఉపయోగించడం.

జుట్టు తెల్లబడకుండా ఉండటానికి, జుట్టు రాలడాన్ని ఆపడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు నిపుణులు ఇస్తున్నారు. వీటిని పాటిస్తే ఈ సమస్యలు శాశ్వతంగా దూరంగా ఉంటాయి.

కలబంద జుట్టుకు అత్యంత ప్రయోజనకరమైనది. వారానికి ఒకసారి జుట్టుకు కలబంద రాయాలి. అంతేకాకుండా దీనితోపాటు ఉల్లిపాయ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. జుట్టుకు ఉల్లిపాయ రసం కూడా రాయవచ్చు.

తలస్నానం చేసిన వెంటనే వెంట్రుకలు దువ్వకూడదు. అలా చేస్తే వెంట్రుకలు తెగిపోవడం, ఎక్కువ జుట్టు రాలిపోవడం వంటి సమస్య మరింత పెరుగుతుంది. అలాగే జుట్టు దువ్వుకోవడానికి కూడా మెత్తటి బ్రిజిల్స్ ఉండే దువ్వెనను ఉపయోగించడం మంచిది.