
Lavender Oil- లావెండర్ ఆయిల్‌ను ముఖం, మెడ, చేతులకు అప్లై చేయడం వల్ల చర్మం యవ్వనంగా ఉండేందుకు సహాయపడుతుంది. కోపాన్ని తగ్గించడం కూడా వృద్ధాప్యాన్ని దూరం చేసేందుకు గొప్పగా సహాయపడుతుంది.

Coconut Oil- కొబ్బరి నూనెను చర్మం సులభంగా గ్రహిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు విటమిన్ ఇ, కెతో పాటు యవ్వనాన్ని కాపాడతాయి.

Castor Oil- ఆముదంలో రిసినోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

Shea Butter- షియా బటర్ శరీరంపై మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. షియా బటర్, ఆలివ్ ఆయిల్ కలిపి అప్లై చేస్తే చాలా మంచిది.

Grapeseed Oil- ద్రాక్ష గింజల నూనెలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఇందులోని యాంటీ ఏజింగ్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మీ చర్మాన్ని సంరక్షిస్తాయి.