
పనిఒత్తిడి, నిద్రలేకపోవడం, అలసిపోవడం, మానసిక ఆందోళనలే తరచూ తలనొప్పి రావడానికి ప్రధాన కారణం అవుతాయి. ఇవే అలవాట్లు దీర్ఘకాలంగా కొనసాగి అది మైగ్రెన్ వంటి ప్రమాధకర సమస్యకు దారి తీస్తుంది. కాబట్టి ఈ సమస్యను త్వరగా పరిష్కరించుకోవడం ఎంతో ముఖ్యం.

అయితే ఈ సమస్యను దూరం చేసుకునేందుకు చాలా మంది తలనొప్పి వచ్చిన ప్రతిసారీ ట్యాబ్‌లెట్స్ వాడడం మనం చూస్తుంటాం. కానీ ఇలా తరచూ మాత్రలు వేసుకోవడం వల్ల మన ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లోనే తరయారు చేసుకునే ఈ సూపర్ డ్రింక్‌తో మీరు సహజంగానే తలనొప్పిని దూరం చేసుకోవచ్చు.

ఈ సూపర్ డ్రింక్ తయారు చేసుకోవడానికి మనకు పెద్ద ఖర్చు కూడా ఏం పట్టదు. చాలా సింపుల్‌గా దీన్ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇందు కోస మనకు తురిమిన అల్లం, చిటికెడు పసుపు, రెండు మిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఒక గ్లాసు నీళ్లు, కొంచెం నిమ్మరసం ఉంటే సరిపోతుంది.

ఈ ఎలా తయారు చేయాలంటే.. ముందుగా స్టవ్ మీద ఒక గ్లాసు నీళ్లు పెట్టి, అందులో ఒక చిన్న అల్లం ముక్క, చిటికెడు పసుపు, రెండు మిరపకాయలు, కొన్ని కొత్తిమీర ఆకులు వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు దాన్ని వడకట్టి ఒక గ్లాసులో పోసుకోవాలి, ఆ తర్వాత అందులో కొంచెం నిమ్మరసం పిండాలి. ఈ డ్రింక్ మీకు తలనొప్పిగా అనిపించినప్పుడు తాగితే తక్షణమే ఉపశమనం అభిస్తుంది.

గమనిక: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.