Glowing Skin: ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. జస్ట్ ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. మీ స్కిన్ బ్రైట్‌గా మారాల్సిందే!

Updated on: Mar 16, 2026 | 12:22 PM

అందంగా ఉండాలి, అందరూ ఆకర్షించే అందాన్ని పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం మార్కెట్‌లో దొరికే రకరకాల బ్యాటీ ప్రాడక్ట్స్‌ను ఉపయోగిస్తారు. కానీ వారు అనుకున్న ఫలితాన్ని పొందలేరు. అలాంటి వారి కోసం ఈ వార్త.. మీ రోజువారి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం, కొన్ని కొత్త అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా మీరు సహజంగా మీ అందాన్ని పెంచుకోవచ్చు. కాబట్టి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాంజ

1 / 5
సహజంగా మెరిసే చర్మం: ప్రస్తుత రద్దీ ప్రపంచంలో, పర్యావరణ కాలుష్యం, లైఫ్‌స్టైల్ కారణంగా మన చర్మ సహజ మెరుపును కోల్పోతుంది. దానికి తోడు కెమికల్స్‌తో నిండిన బ్యాటీ ప్రాడక్ట్స్ వాడడం వల్ల చర్మం మరింత నశిస్తుంది. కాబట్టి మన దైనందిన జీవితంలో కొన్ని సాధారణ మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు.

2 / 5
హైడ్రేటెడ్‌గా ఉండటం: అందమైన చర్మానికి మొదటి రహస్యం హైడ్రేటెడ్‌గా ఉండటమే. మీరు ఈ ఎండాకాలంలో హైడ్రెట్‌గా ఉండాలంటే రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగడం చాలా అవసరం. నీరు త్రాగడం వల్ల మీ శరీరం నుండి విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే మొటిమలను తగ్గిస్తుంది. సాదా నీటిలో నిమ్మరసం లేదా మంచినీరు కలపడం వల్ల మీ చర్మానికి అదనపు మెరుపు వస్తుంది.

3 / 5
పోషకమైన ఆహారం: మన అందం మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను మన ఆహారంలో చేర్చుకోవడం ముఖ్యం. ముఖ్యంగా విటమిన్లు సి, ఇ అధికంగా ఉండే నారింజ, బొప్పాయి, పాలకూర, గింజలు చర్మ కణాలను పునరుద్ధరిస్తాయి. జంక్ ఫుడ్‌, చక్కెర అధికంగా ఉండే ఆహారాలను తినడం తగ్గించడం వల్ల చర్మంపై ముడతలు తగ్గి చర్మ ఆరోగ్యం మెరుగుపుడుతుంది.

4 / 5
సరైన నిద్ర: చర్మ సంరక్షణలో నిద్ర చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మీరు రోజుకు కనీసం 7 నుండి 8 గంటల పాటు గాఢ నిద్ర పొందడం చాలా అవసరం. నిద్రలోనే మన చర్మ కణాలు తమను తాము పునరుద్ధరించుకుంటాయి. తగినంత నిద్ర లేకపోవడం వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు, ముఖంపై అలసిపోయినట్లు కనిపిస్తుంది. అలాగే, ధ్యానం లేదా యోగా సాధన చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

5 / 5
శుభ్రత పాటించడం: రోజుకు రెండుసార్లు తేలికపాటి సబ్బు లేదా ఓట్ మీల్ తో ముఖం కడుక్కోవడం వల్ల మురికి తొలగిపోతుంది. అదేవిధంగా, ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు మీ చర్మాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఎండలోని అతినీలలోహిత కిరణాలు చర్మాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి, గొడుగు లేదా నాణ్యమైన సన్‌స్క్రీన్ ఉపయోగించడం అవసరం. రాత్రి పడుకునే ముందు ముఖం కడుక్కోవడం, కొద్దిగా కొబ్బరి నూనె లేదా కలబంద జెల్ రాయడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది.( Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు)

Follow Us