Brittle Nails: చేతి గోర్లు మాటిమాటికీ విరిగిపోతున్నాయా? మీ హెల్త్ డేంజర్‌లో ఉన్నట్లే..

|

Nov 07, 2024 | 1:46 PM

చేతి గోళ్లను బట్టి మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఆరోగ్యంలో సమస్యలు తలెత్తితే సంకేతాలు గోళ్లలో కనిపిస్తాయి. కొందరికి గోర్లు చాలా పెలుసుగా ఉంటాయి. చిటికిమాటికి విరిగిపోతుంటాయి.. ఇలాంటి వారు వీలైనంత త్వరగా డాక్టర్ ను సంప్రదించాలి. ఎందుకంటే..

1 / 5
చేతి గోర్లు, కాలి గోర్లు బలహీనంగా ఉంటే తరచుగా విరిగిపోతుంటాయి. ఇలాంటి లక్షణం కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. అందుకు గల కారణాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే గోళ్లు విరగడం మామూలు విషయం కాదు.

2 / 5
చర్మవ్యాధి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇనుము, జింక్.. వంట అనేక ఇతర పోషకాలు లోపం వల్ల గోర్లు విరిగిపోతాయి. కాబట్టి, సరైన ఆహారం, రెగ్యులర్ కేర్‌తో గోర్లు విరగకుండా నిరోధించవచ్చు.

3 / 5
విటమిన్ B7ని బయోటిన్ అని కూడా పిలుస్తారు. ఇది గోర్లు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. దాని లోపం కారణంగా, గోర్లు విరిగిపోతాయి. వాటి రంగు మారుతుంది. దీంతో అవి సరిగ్గా పెరగవు. కాబట్టి, ఈ విటమిన్‌ లోపాన్ని భర్తీ చేయడానికి ఆహారంలో గుడ్లు, పాలు, చీజ్, మాంసం, చేపలు, తృణధాన్యాలు, ఆకుపచ్చ కూరగాయలు, నట్స్‌ తినాలి.

4 / 5
విటమిన్ ఇ అనేది యాంటీఆక్సిడెంట్. ఇది గోళ్ల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. దీని లోపం వల్ల గోళ్లు విరగడం, గోరు రంగులో మార్పులు, నెయిల్ ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు వస్తాయి. ఈ లోపాన్ని భర్తీ చేయడానికి బాదం, వాల్‌నట్, పిస్తా, పొద్దుతిరుగుడు గింజలు, వేరుశెనగ, పచ్చి కూరగాయలు, పండ్లను ఆహారంలో చేర్చుకోవచ్చు.

5 / 5
 ఐరన్ లోపం వల్ల కూడా గోళ్లు విరగడం ప్రారంభమవుతుంది. దీని వల్ల గోళ్ల రంగు మారడం, గోళ్ల ఎదుగుదల ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దాని లోపాన్ని అధిగమించడానికి, రెడ్ మీట్, పౌల్ట్రీ, చేపలు, గుడ్లు, పాలు, చీజ్, తృణధాన్యాలు, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తినవచ్చు.