
సాంస్కృతిక నగరం మైసూర్‌లో మైసూర్ పాక్ చాలా ఫేమస్. మెత్తగా, నోటిలో వేసుకోగానే కరిగిపోయే ఈ సంప్రదాయ స్వీట్ ఒరిజినల్ రెసిపిని రుచి చూడాలంటే మైసూరుకు వెళ్లక తప్పదు. మీరు ఎప్పుడైనా మైసూర్ వెళితే అక్కడ ఈ డెజర్ట్‌తోపాటు ఈ కింది ఫేమస్ వంటకాలను కూడా ట్రై చేయండి.

మైసూర్ మసాలా దోస.. ఇది చాలా మంది తినే మసాలా దోస మాత్రం కాదు. మైసూర్‌లో దొరికే ఈ మసాలా దోసె కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ క్రిస్పీ దోసె అరటి ఆకులో వడ్డిస్తారు. ఈ దోసెను తినడానికి నట్ చట్నీ ఇస్తారు. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.

బిస్బెలేబాత్.. బిస్బెలేబాత్ కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన చిరుతిండి. అయితే మైసూర్‌లో ఈ స్పెషల్ స్నాక్‌ను డిఫరెంట్‌గా తయారుచేస్తా. ఇందులో వివిధ రకాల పప్పులు, కూరగాయలు వినియోగిస్తారు. దీని రుచి బలేగా ఉంటుందిలే.

జాస్మిన్ ఇడ్లీ.. ఈ ఇడ్లీ దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రేక్‌ఫాస్ట్‌లలో ఒకటి. ఈ ఇడ్లీలు రుచి భిన్నంగా ఉంటుంది. మైసూర్‌లో జాస్మిన్ ఇడ్లీని పలురకాల చట్నీలు, సాంబార్‌లతో వడ్డిస్తారు. రుచి అద్భుతంగా ఉంటుంది.

ఖరా బాత్.. దీనిని రవా బాత్ అని కూడా పిలుస్తారు. ఇది మైసూర్‌లో ప్రసిద్ధ అల్పాహారం. మైసూర్‌లోని ఈ ప్రసిద్ధ వంటకం సుజీ రవ్వ, ఉల్లిపాయలు, టొమాటో, మిశ్రమ కూరగాయలు, జీడిపప్పులను ఉపయోగించి తయారు చేస్తారు. ఉప్పిట్టు లేదా ఉప్మా అని పిలువబడే ఖారా బాత్ ఇక్కడి ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు.