చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి ఏది మంచిది..?

Updated on: Dec 06, 2025 | 9:15 PM

Mutton vs Chicken: శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలలో ప్రోటీన్ ఒకటి. మాంసాహారం విషయానికొస్తే.. మటన్, చికెన్ రెండింటిలోనూ ప్రోటీన్ ఉంటుంది. అయితే చాలా మంది ఏ ప్రోటీన్ అవసరం.? ఏది ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది అనే దాని గురించి గందరగోళం చెందుతారు. ఈ విషయంలో నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ఈ రెండు మాంసాల యొక్క ముఖ్యమైన పోషక లక్షణాలను స్పష్టం చేసింది.

1 / 5
మటన్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో ఎక్కువ కేలరీలు పేరుకుపోతాయి. ఇది గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. మటన్‌లో ఎక్కువ కొవ్వు ఉంటుంది కాబట్టి 100 గ్రాముల మటన్‌లో సుమారు 230 నుండి 300 కేలరీలు ఉంటాయి.

2 / 5
చికెన్ విషయానికొస్తే.. చికెన్ బ్రెస్ట్ కేవలం 165 కేలరీలు మాత్రమే కలిగి ఉంటుంది. చికెన్‌లో వింగ్స్, తొడల భాగాలలో కేలరీల కంటెంట్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. మటన్‌తో పోలిస్తే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి.

3 / 5
నేషనల్ చికెన్ కౌన్సిల్ ప్రకారం.. చికెన్ ఒక లీన్ ప్రోటీన్ మూలం. ఇందులో కొవ్వు, సంతృప్త కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. ఇది డైట్ చేసే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

4 / 5
ప్రోటీన్ విషయానికి వస్తే.. చికెన్ బ్రెస్ట్‌లో 100 గ్రాములకు 31 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అదే మటన్‌లో 100 గ్రాములకు కేవలం 25 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అంటే తక్కువ కేలరీలతో పాటు చికెన్‌లో మటన్ కంటే ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది.

5 / 5
ఏది మంచిది: ఆరోగ్య ప్రయోజనాల పరంగా పరిశీలిస్తే.. మటన్ కంటే చికెన్ గొప్పదని చెప్పవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నించేవారికి, తరచుగా మాంసాహారం తినేవారికి చికెన్ ఉత్తమం. అయితే రెండింటిలోనూ వేర్వేరు పోషకాలు ఉన్నందున రెండింటినీ మితంగా తినడం ఎల్లప్పుడూ ఆరోగ్యానికి మంచిది.