ఎంతకూ ఉపశమనం లేకుండా నొప్పిఉండటం, మెడలో, వీపు పైభాగంలో, వీపు కింది భాగంలో చాలా నొప్పిగా ఉండటం,. ఏదైనా బరువు ఎత్తినపుడు, శ్రమతో కూడిన పనులేమైనా చేసినపుడు నొప్పి మరింత ఎక్కువ అనిపించటం. ఎక్కువ సేపు కూర్చున్నా, నిలబడ్డా వీపు మధ్య, కింది భాగాలలో నొప్పి, వీపు కింది భాగం నుంచి పిరుదులు, తొడలు, పిక్కలు, వేళ్ల వరకూ నొప్పి ఉండటం వెన్నుముక నొప్పి లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు.