Multivitamin Side Effects: మీరూ విటమిన్‌ ట్యాబ్లెట్స్‌ వాడుతున్నారా? క్యాన్సర్, గుండె జబ్బులు ఇంకా..

Updated on: Jan 02, 2024 | 11:21 AM

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్లు చాలా అవసరం. ముఖ్యమైన విటమిన్లన్నీ ఆహారం ద్వారా లభిస్తాయి. రోజువారీ ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. విటమిన్లు కూరగాయలలో ఎక్కువగా ఉంటాయి. క్రమం తప్పకుండా కూరగాయలు, చేపలు, గుడ్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మనకు తెలియకుండానే తక్కువ విటమిన్లు తీసుకుంటాం. అంటే, మనం సరైన ఆహారం తీసుకుంటున్నామని అనుకుంటాం, కానీ శరీరానికి సరిపడా అన్ని పోషకాలు అందవు..

1 / 5
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్లు చాలా అవసరం. ముఖ్యమైన విటమిన్లన్నీ ఆహారం ద్వారా లభిస్తాయి. రోజువారీ ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. విటమిన్లు కూరగాయలలో ఎక్కువగా ఉంటాయి. క్రమం తప్పకుండా కూరగాయలు, చేపలు, గుడ్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మనకు తెలియకుండానే తక్కువ విటమిన్లు తీసుకుంటాం. అంటే, మనం సరైన ఆహారం తీసుకుంటున్నామని అనుకుంటాం, కానీ శరీరానికి సరిపడా అన్ని పోషకాలు అందవు.

2 / 5
చాలా మంది మెడికల్‌ షాపుల్లో విటమిన్ ట్యాబ్లెట్లు కొని తింటుంటారు. ఇలాంటి అలవాటు తెలియకుండానే ఆపదలు తెచ్చిపెడతాయి. విటమిన్లను ఎల్లప్పుడు ఆహారం ద్వారానే తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ ఎ చాలా శక్తివంతమైనది. ఇది నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ధూమపానం చేసే వారు విటమిన్ ఎ మాత్రలు తరచూ వేసుకోవడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని అమెరికన్ నేషనల్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ పరిశోధన చెబుతోంది. తగినంత విటమిన్ ఎ పొందడానికి చిలగడ దుంపలు, క్యారెట్లు, పండ్లు తినాలి.

3 / 5
విటమిన్ B6 రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా శరీరాన్ని బలపరుస్తుంది. కానీ ఈ విటమిన్ రిచ్ టాబ్లెట్‌ను ఒక రోజులో 10 mg కంటే ఎక్కువ తీసుకుంటే నరాల సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా, చర్మ సమస్యలు, వికారం, గుండెల్లో మంట వచ్చే అవకాశాలు పెరుగుతాయి. రోజువారీ ఆహారంలో చేపలు, బంగాళదుంపలు, పిస్తా వంటి ఆహారాలను తింటే బీ6 పరిపడా అందుతుంది.

4 / 5
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి సహాయపడుతుంది. అయితే దీన్ని రోజూ ట్యాబ్లెట్స్‌ రూపంలో తీసుకుంటే కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఎక్కువ. బొప్పాయి, నారింజ, బ్రకోలీ, టొమాటోలను ప్రతిరోజూ తింటే శరీరంలో తగినంత విటమిన్ సి ఉత్పత్తి అవుతుంది.

5 / 5
చాలా మంది ట్యాబ్లెట్లలో అన్ని విటమిన్లు ఉంటాయని, వాటిని తినడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవడం సాధ్యమవుతుందని అనుకుంటారు. అందుకు మల్టీ విటమిన్ మాత్రలు తరచూ వినియోగిస్తుంటారు. కానీ ఆ ఆలోచన అస్సలు కరెక్ట్ కాదు. ఇది గుండె సమస్యలు, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.