ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేపలు.. చూడగానే నోరూరిపోతుంది..! కొనాలంటేనే ఏడుపోస్తుంది..!!

|

Oct 19, 2024 | 9:57 AM

ప్రపంచంలో నాన్ వెజ్ ప్రియులకు కొరత లేదు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో చాలా మంది ప్రజల ప్రధాన ఆహారం చేపలు, ఇతర మాంసాహారమే ఎక్కువ. బెంగాలీ కుటుంబాల్లో కూడా చేపలను ఎంతో ఇష్టంగా తింటారు. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా చేపల మార్కెట్‌ అతిపెద్దది. చాలా దేశాలు ఇతర దేశాలకు చేపలను విక్రయిస్తాయి. అనేక దేశాలలో చేపల వేలం కూడా జరుగుతంది. మన దేశంలో కూడా చాల ప్రాంతాల్లో వేలం ద్వారా చేపలను కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రపంచంలోనే తినడానికి అనువైన అత్యంత ఖరీదైన చేపలు ఏవో తెలుసా? ఇప్పుడు ఆ చేపల గురించి తెలుసుకుందాం..

1 / 5
Bluefin Tuna- మనం 2024 సంవత్సరంలో అత్యంత ఖరీదైన చేప గురించి మాట్లాడినట్లయితే ముందుగా వచ్చే పేరు బ్లూఫిన్ ట్యూనా. ఈ చేపల శరీరం పెద్దది. టార్పెడో ఆకారంలో ఉంటుంది. ఇది క్రాస్ సెక్షన్‌లో వృత్తాకారంగా ఉంటుంది. ఈ చేప ధర పౌండ్‌కు 5000 డాలర్లు (4 లక్షల 20 వేల రూపాయలు) వరకు ఉంది. ఇది చాలా రుచికరమైన చేపలలో ఒకటిగా చెబుతారు.

2 / 5
American Glass Eel- ఈ చేప ఉత్తర అమెరికాలోని ఈశాన్య తీరాలలో కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన చేప. ఇది మీకు గాజులా కనిపిస్తుంది. వాటి పరిమాణం చాలా చిన్నది (సుమారు 3 అంగుళాలు). అమెరికన్ ఈల్స్ 4 అడుగుల వరకు పెరుగుతాయి. వాటి ధర పౌండ్‌కు 3000 డాలర్లు (రూ. 2,52,181) వరకు ఉంటుంది.

3 / 5
Pufferfish- పఫర్ ఫిష్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన చేపలలో ఒకటి మాత్రమే కాదు, చాలా ప్రమాదకరమైనది కూడా. దీని ముళ్ళు చాలా విషపూరితమైనవి. అందుకే ఈ పఫర్‌ఫిష్‌ని అమెరికాలోని 50 కంటే తక్కువ రెస్టారెంట్లలో మాత్రమే అందిస్తారు. ఈ చేప ధర పౌండ్ (17 వేల రూపాయలు) 200 డాలర్ల వరకు ఉంది.

4 / 5
Wild Alaskan King Salmon- ఈ చేప అలస్కాలోని అందమైన నీటిలో కనిపిస్తుంది. ఈ చేప రెడ్ కింగ్ సాల్మన్ లాగా కనిపిస్తుంది. ప్రజలు ఎంతో ఇష్టంగా దీన్ని తింటారు. దీన్ని కొనడానికి ఎంత డబ్బు ఖర్చు చేయడానికి కూడా వెనుకడుగు వేయరు. సాధారణంగా ఈ చేప పౌండ్‌కు $70 (రూ. 5,884) వరకు లభిస్తుంది.

5 / 5
Swordfish- కత్తిలాంటి ముక్కు కారణంగా ఈ చేపకు ఆ పేరు వచ్చింది. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపిస్తుంది. దాన్ని పట్టుకోవడమే కాకుండా తినడానికి కూడా జనం ఎక్కువ ఆసక్తిగా ఉంటారు. ఈ చేప బరువు 91 కిలోల వరకు ఉంటుంది. మీరు ఈ చేపను పౌండ్‌కు 60 డాలర్లు అంటే 5100 రూపాయల వరకు మార్కెట్లో లభిస్తుంది.