
బాక్సర్: ఇది వేట కుక్క. కాపలాదారు కూడా. జర్మన్ మూలం. చాలా శక్తివంతమైన దవడలతో, ఈ కుక్క కాటు కూడా తీవ్రంగా ఉంటుంది.

బుల్‌మాస్టిఫ్: ఈ కుక్క బరువు 130 పౌండ్లు, దూకుడు స్వభావం కలిగి ఉంటుంది. UKలో పుట్టింది. వాటికి శిక్షణ ఇస్తే యజమాని చెప్పేది వింటుంది. లేకుంటే ప్రమాదమే. ఇవి చిన్న జంతువులపై సులభంగా దాడి చేస్తాయి.

డాబర్‌మాన్ పిన్‌షర్: ఈ కుక్కను పోలీసు విభాగాల్లో ఉపయోగిస్తారు. జర్మనీలో పుట్టింది. అపరిచితులతో దూకుడుగా ప్రవర్తిస్తుంది. ఇటీవలి సంవత్సరాలలో ఈ జాతికి ప్రజాదరణ పెరిగింది.

జర్మన్ షెపర్డ్: ఇది అత్యంత ప్రసిద్ధ జాతి. జర్మనీలో పుట్టింది. దీని కాటు మొత్తం 1,060 న్యూటన్ల శక్తిని కలిగి ఉంటుంది. సాధారణంగా పోలీసు డిపార్ట్‌మెంట్లలో, కొందరు జంతుప్రేమికుల ప్రేమికుల ఇళ్లలో కనిపిస్తాయి.

హస్కీ: అధిక శక్తి గల హస్కీ కుక్కను ఇంట్లో ఉంచుకోవడం ప్రమాదకరం. ఇది సైబీరియాకు చెందినది. అమెరికాలో 15 మరణాలకు హస్కీ కుక్కలే కారణమని అనుమానిస్తున్నారు.

పిట్ బుల్: ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కుక్క. అమెరికాకు చెందినది. పిట్ బుల్ బ్రీడింగ్ చాలా దేశాల్లో నిషేధించబడింది. ప్రమాదకరమైన కుక్క జాతులు

వోల్ఫ్ హైబ్రిడ్: ఇది తోడేళ్ళను పోలి ఉండే కుక్క. ఇథియోపియాలో పుట్టింది. ఈ కుక్కలు జన్యుపరంగా ప్రమాదకరమైనవిగా పరిగణించబడతాయి. కొన్ని దేశాల్లో వాటిని పెంపకం చట్టవిరుద్ధం.