Pilot whales: అమ్మో బాబోయ్.. సముద్ర తీరంలోకి కొట్టుకొచ్చిన వందలాది తిమింగలాలు

|

Jul 26, 2023 | 7:29 PM

ఆస్ట్రేలియాలోని ఓ సముద్ర తీరంలో 100కు పైగా పైలట్ తిమింగలాలు కొట్టుకురావడం అందర్ని ఆశ్చర్యం కలిగించింది. అందులో దాదాపు 50 కి పైగా ప్రాణాలు కోల్పోయాయి. మిగిలిన తిమింగలాలను రక్షించేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

1 / 5

2 / 5
తూర్పు అల్బానికి సుమారు 60 కి.మీ దూరంలో ఉన్న చెయిన్స్ బీచ్‌లో ఈ ఘటన జరిగింది. మంగళవారం సాయంత్రం తీరానికి డజన్ల కొద్ది తిమింగలాలు కొట్టుకొచ్చి.. ఇసుకలో చిక్కుకుపోయాయి. బుధవారం ఉదయం 36 తిమింగలాలు మృతి చెందగా వీటి సంఖ్య ఇప్పుడు 51కి చేరింది.

3 / 5
ఈ తీరం వద్దకు రావద్దని అధికారులు అక్కడి ప్రజలను కోరారు. మరోవైపు ఈ బీచ్‌లో తిమింగలాల కళేబరాల నుంచి వచ్చే వాసన షార్క్ చేపలను విపరీతంగా ఆకర్షిస్తుందని అధికారులు తెలిపారు. అందుకు ఈ ప్రాంతాల్లో సముద్రం వద్దకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.

4 / 5
వాస్తవానికి పైలట్ తిమింగలాలు అనేవి చాలా అరుదైన జీవులు. ఇవి రెండు మూడు సంవత్సరాలకొకసారి బిడ్డకు జన్మనిస్తాయి. అలాగే ఆ బిడ్డను పెంచేందుకు తల్లి కొన్ని నెలల పాటు తిండి లేకుండా ఉండాల్సి వస్తుంది. అలాగే ఆ బిడ్డ పెరిగి తోడు వెతుక్కునే వరకు దాన్ని కాపాడుకునేందుకు కొన్ని తిమింగాలు మళ్లి గర్భం దాల్చకుండా జాగ్రత్తపడతాయి.

5 / 5
పునరుత్పత్తి దశ దాటాక ఎక్కువ కాలం జీవించే ప్రాణి మనిషి. ఆ తర్వాత తిమింగలాలే. 40 ఏళ్ల నాటికి తిమింగలాలు పునరుత్పత్తి శక్తిని కోల్పోతాయి. 50, 60 ఏళ్ల వయసులో మెనోపాజ్‌కి గురవుతాయి. ఈ మధ్య కాలంలో తరచూదా ఆస్ట్రేలియా తీరానికి పైలట్ తమింగాలాలు వందల సంఖ్యలో కొట్టుకొచ్చి ప్రాణాలు కోల్పోతున్నాయి.