ఇలా పెసరపప్పు చారు చేస్తే.. తస్సాదియ్యా.. ఏ మాంసం కూర కూడా పనికిరాదంతే..!

Updated on: Mar 27, 2026 | 11:35 AM

Pesara pappu charu recipe: పప్పు చారు అందరూ ఇష్టంగా తింటారు. ఇక పల్లెటూర్లలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వారంలో మూడు సార్లు పప్పు ఎక్కువగా తింటారు. ఈ సారి మీ ఇంట్లో పెసరపప్పు చారు ట్రై చేయండి. ఒకసారి చేస్తే ఆపకుండా లాగిస్తూనే ఉంటారు.

1 / 5

కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పెసరపప్పు , కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి , ఒక పెద్ద ఉల్లిపాయ , నాలుగు టమాటా - 
పోపు దినుసులు, అర టీ స్పూన్  ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మినపప్పు, రెండు ఎండుమిర్చి, కరివేపాకు,
ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, కొత్తిమీరను తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పెసరపప్పు , కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి , ఒక పెద్ద ఉల్లిపాయ , నాలుగు టమాటా - పోపు దినుసులు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మినపప్పు, రెండు ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, కొత్తిమీరను తీసుకోవాలి.

2 / 5
పెసరపప్పు చారు ఎలా తయారు చేయాలంటే? ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకుని కడిగి కుక్కర్లో వేసి దానిలో రెండు గ్లాస్ ల నీళ్లు పోసి మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇక ఇప్పుడు ఉడుకుతున్న పప్పులో  కొద్దిగా చింతపండు రసం, నాలుగు పచ్చిమిర్చి, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు , అర టీ స్పూన్  పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి.

4 / 5
ఉడికిన పప్పును కిందకు దించి పప్పు గుత్తితో  మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్స్ నూనె లేదా  నెయ్యి  చేసి, పోపు, నాలుగు కరివేపాకు ఆకులు, కొద్దిగా ఇంగువ వేసి బాగా వేయించుకోవాలి.

5 / 5
ఇక చివర్లో మంచి రుచి కోసం దించే ముందు అర కట్ట కొత్తిమీరను తీసుకుని కట్ చేసి పప్పు చారులో చల్లుకుని స్టవ్ ఆపేసి వడ్డించుకుని తినడమే. అంతే, వేడి వేడి పెసర పప్పు చారు రెడీ.

Follow Us