యోగాసనాలు వేసిన సమయంలో కండరాలు సాగిపోవడమే కాక శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో యోగా చేసిన వెంటనే స్నానం చేయకూడదు.
యోగా చేసిన సమయంలో చాలా శక్తి ఖర్చవుతుంది. ఈ కారణంగా యోగా ముగిసిన వెంటనే నీళ్లు తాగకూడదు.
యోగాభ్యాసం తర్వాత ఆకలి అనిపించినా వెంటనే తినకూడదు. కావాలంటే యోగాకు ముందు లైట్ ఫుడ్ తీసుకోవచ్చు.
నొప్పులు లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు యోగా చేయకపోవడమే మంచిది.
యోగాకు ముందు కొంత సమయం వార్మప్ చేయడం మర్చిపోకండి. లేకపోతే కండరాలు పట్టుకుపోయే ప్రమాదం ఉంది.