Jaggery Side Effects: పాలు, టీలో కూడా బెల్లం వాడుతున్నారా? అయితే, ఈ ఎఫెక్ట్స్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే..!

|

May 28, 2022 | 6:30 AM

Jaggery Side Effects: కొందరు వ్యక్తులు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు అనేక రకాల ఆహారాలను ప్రయత్నిస్తారు. అయితే, కొన్ని ప్రయత్నాలు ప్రయోజనానికి బదులుగా హానీని తలపెడతాయి. ఇలాంటి వాటిలో పాలు, టీ లో బెల్లం కలుపుకోవడం ఒకటిగా..

1 / 5
Jaggery Side Effects: కొందరు వ్యక్తులు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు అనేక రకాల ఆహారాలను ప్రయత్నిస్తారు. అయితే, కొన్ని ప్రయత్నాలు ప్రయోజనానికి బదులుగా హానీని తలపెడతాయి. ఇలాంటి వాటిలో పాలు, టీ లో బెల్లం కలుపుకోవడం ఒకటిగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మితమేప్పుడూ మేలు చేస్తుంది.. అతి ఎప్పుడూ హానీ చేస్తుందని పెద్దలు అంటారు. ఈ సూచన బెల్లం విషయంలోనూ వర్తి్స్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఆయుర్వేదం ప్రకారం పాలు, టీ లో బెల్లం వేసుకుని అతిగా తాగొద్దని చెబుతున్నారు. దాని వలన సమస్యలొస్తాయట. మరి ఆ సమస్యలేంటో తెలుసుకుందాం..

2 / 5
బెల్లం బదులు మిశ్రి: టీలో తీపి కావాలంటే బెల్లం బదులు చెక్కర పటికాలను ఉపయోగించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం.. దీని ప్రభావం చల్లదనాన్ని కలిగి ఉంటుంది. అయితే దీన్ని కూడా మితంగానే తీసుకోవాలని సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు.

3 / 5
కడుపు నొప్పి: పాలలో ఉండే కొవ్వు, బెల్లం కారణంగా ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి. ఆయుర్వేదం ప్రకారం.. దీనిని తీసుకోవడం వలన కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు, ఇతర ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి.

4 / 5
బరువు పెరుగుట: ఆయుర్వేదం ప్రకారం బెల్లం కలిపిన పాలు, టీ మీ బరువును పెంచుతుంది. బెల్లంలో చక్కెర ఉండగా, పాలలో కొవ్వు కూడా ఉంటుంది. ఈ రెండింటిని మిక్స్ చేయడం, అధికంగా తాగడం వల్ల బరువు పెరుగుతారు.

5 / 5
రక్తంలో చక్కెర: 10 గ్రాముల బెల్లంలో 9.7 గ్రాముల చక్కెర కలిగి ఉంటుందట. దీని కారణంగానే బెల్లంను అధికంగా తీసుకుంటే, అది శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని కూడా పెంచుతుందట. దీనికి బదులుగా గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగవచ్చు.