బీటెక్‌తో సహా పలు టెక్నికల్ డిగ్రీ అర్హతతో చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. చెన్నై కేంద్రంగా ఉన్న ఈ సంస్థలో మొత్తం 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు
నోటిఫికేషన్‌లో భాగంగా జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, రోలింగ్ స్టాక్, పవర్ సిస్టమ్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
ఈ ఖాళీలకు అప్లై చేసుకునే అభ్యర్థులను పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ సీఏ/ ఎంబీఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అంతేకాకుండా సంబంధిత విభాగంలో 02 నుంచి 25 ఏళ్ల అనుభవం ఉండాలి.
అభ్యర్థుల వయసు 30 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 60,000 నుంచి రూ. 2.3 లక్షల వరకు చెల్లిస్తారు.
అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు 04-08-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.