1 / 5
ప్రతి ఇంట్లో పప్పు చారు లేకుండా రోజు గడవదు. మన రోజువారీ ఆహారంలో పప్పు తప్పనిసరిగా తీసుకుంటూ ఉంటాం. కంది పప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పప్పులో ప్రొటీన్‌తో పాటు పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే రక్తహీనతతో బాధపడుతున్నవారికి వైద్యులు కంది పప్పు తినాలని సిఫార్సు చేస్తుంటారు.