
చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికీ మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా మామిడి పండ్లు తింటారు. అయితే కొన్ని సార్లు కల్తీ మామిడి పండ్లు తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా కల్తీ మామిడి పండ్ల వలన వాంతులు, విరేచనాలు, తల తిరగడం, చివరకు క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే అ సలు రసాయనాలతో నిండిన మామిడి పండ్లను మార్కెట్‌లో ఎలా గుర్తించాలంట. ఈ ఐదు విషయాలను అస్సలే మర్చిపోకూడదంట.

మామిడి పండును నొక్కి చూడటం వలన అది కల్తీ జరిగినదా? లేక సహజంగా పండిన పండునా సులభంగా తెలుసుకోవచ్చునంట. మామిడి పండు నొక్కగానే అన్ని వైపులా సమానంగా మెత్తగా ఉంటే అది సహజమైనది, లేదా ఓవైపు గట్టిగా, మరో వైపు పండినట్లు ఉన్నా లేదా పైన పండినట్లు ఉండి, లోపల గట్టిగా ఉన్నా అది అసహజమైన, కల్తీ పండు అని గుర్తించాలి.

మార్కెట్లో కొన్ని సార్లు పండు మొత్తం పసుపు రంగులో ఉన్న మామిడి పండ్లు కనిపిస్తుంటాయి. కానీ అవి అస్సలే మంచివి కావంట, రసాయనాలతో మాగబెట్టిన పండ్లు మొత్తం ఒకే రంగులో పసుపు రంగులో ఉంటాయి. సహజంగా పండిన పండ్లు కొంచెం ఆకుపచ్చ రంగులో, కొంత భాగం పసుపు రంగులో ఉంటుంది.

మామిడి పండు తీపి రుచి వాసనతో ఉంటే అది బాగా పండిన, సహజమైన పండు. ముఖ్యంగా మామిడి పండు తొడమ దగ్గర మంచి తీపి వాసన వస్తే అది సహజంగా పండిన పండు, ఇవేవి లేకుండా రసాయనాల వాసన వస్తున్నా, అసలు వాసన లేకపోయినా అది అసహజమైన పండు అని గుర్తించాలని చెబుతున్నారు నిపుణులు.

అంతే కాకుండా, మామిడి పండు కోసినప్పుడు మంచి పుసుపు రంగులో ఉన్నా అది కల్తీ లేని పండు, అలాగే, నీటిలో వేసినప్పుడు ఏ మామిడి పండు అయితే అడుగుకు చేరుతుంందో అది సహజమైన మామిడి పండు. ఈ చిట్కాలతో సహజమైన మామిడి పండ్లను సులభంగా గుర్తించవచ్చును.