విధి అంటే ఇదేనా.. 29 ఏళ్ల తర్వాత కొడుక్కి ఫుట్ పాత్ పై బిచ్చగాడిలా కనిపించిన తండ్రి.. కానీ ఆ తర్వాత..

Updated on: Jul 25, 2026 | 4:04 PM

 దాదాపు 29 ఏళ్ల క్రితం భార్యా పిల్లలను విడిచిపెట్టి వెళ్లిపోయిన ఓ వ్యక్తి చివరకు హైదరాబాద్‌లోని హైదర్‌నగర్‌లో ఒంటరిగా జీవిస్తూ మృతి చెందాడు. క్యాన్సర్ లక్షణాలు ఉన్నప్పటికీ చికిత్సకు దూరంగా ఉంటూ భిక్షాటనతో జీవనం సాగించిన అతడు, పోషకాహార లోపం, అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

1 / 5
హైదరాబాద్ నగరంలో హృదయాలను కలిచివేసే విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబాన్ని వదిలేసి దాదాపు మూడు దశాబ్దాల పాటు భార్యా పిల్లలకు దూరంగా జీవించిన ఓ వ్యక్తి, చివరికి అనారోగ్యంతో ఫుట్‌పాత్‌పైనే జీవితం ముగించాడు. ఈ ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

2 / 5
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... మేడ్చల్‌లోని హ్యాపీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మహిళ భర్త గుండేటి జనార్ధన్ (64) సుమారు 29 సంవత్సరాల క్రితం ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి భార్య, పిల్లలను పూర్తిగా వదిలేసి ఎక్కడో జీవనం సాగించాడు. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ భార్యపై పడ్డాయి. ఆమె రోజువారీ కూలీ పనులు చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసింది.

3 / 5
ఈ ఏడాది మార్చి నెలలో ఆమె కుమారుడు రూపేష్‌కు జనార్ధన్ అనుకోకుండా కనిపించాడు. అప్పటికే కొండాపూర్ ప్రాంతంలోని ఫుట్‌పాత్‌పై నివసిస్తూ భిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు తెలిపాడు. ఆరోగ్యం బాగా క్షీణించిందని, వైద్య చికిత్స చేయించాలని కుమారుడిని కోరాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను కొంపల్లిలోని కనెక్ట్ డయాగ్నస్టిక్స్ సెంటర్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. పరీక్షల్లో క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

4 / 5
అయితే కుమారుడు చికిత్స చేయించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, జనార్ధన్ అందుకు అంగీకరించలేదు. కుటుంబంతో కలిసి ఉండేందుకు కూడా నిరాకరించి మళ్లీ వెళ్లిపోయాడు. అనంతరం వారితో ఎలాంటి సంబంధం పెట్టుకోకుండా ఒంటరిగానే జీవనం కొనసాగించాడు. ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 1.52 గంటల సమయంలో కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ నుంచి మహిళకు ఫోన్ కాల్ వచ్చింది. ఆమె భర్త మరణించినట్లు పోలీసులు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా, భర్త మృతదేహాన్ని గుర్తించింది.

5 / 5
విచారణలో జనార్ధన్ హైదర్‌నగర్ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవించేవాడని, రాత్రి వేళల్లో మైసమ్మ ఆలయం వెనుక ఉన్న ఎంఎంఎస్ ఫ్యాబ్రికేషన్ షట్టర్ ముందు నిద్రించేవాడని తెలిసింది. అనారోగ్యం, సరైన వైద్య చికిత్స లేకపోవడం, తగిన పోషకాహారం అందకపోవడంతో ఆరోగ్య పరిస్థితి క్రమంగా విషమించి ఆయన మరణించి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. తన భర్త మృతిపై ఎవరి పట్ల కూడా ఎలాంటి అనుమానం లేదని భార్య పోలీసులకు స్పష్టం చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసును హెడ్ కానిస్టేబుల్ జె. దత్తాత్రేయులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us