ఆంధ్రా స్టైల్ మామిడికాయ తురుము పచ్చడి.. వేడి అన్నంలోకి తింటే స్వర్గమే

Updated on: Apr 17, 2026 | 9:43 AM

Andhra mango pickle recipe in Telugu: వేసవికాలంలో మనం మామిడికాయలతో అనేక రకాల పచ్చళ్లు పెట్టుకుంటాము ఇది పాత కాలం నుంచి సాగుతుంది. మామిడికాయలను కోసి ఆవకాయ పచ్చడి పెడుతుంటాం.అయితే, ఈ సారి మామిడికాయను తురిమి పచ్చడి చేయండి. వేడి అన్నంలోకి తింటే స్వర్గమే

1 / 5
కావాల్సిన పదార్దాలు: ఒక కప్పు పచ్చి మామిడికాయ తురుము, మూడు టేబుల్ స్పూన్స్  కారం, ఒక టేబుల్ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె,  అర టీ స్పూన్ ఆవాలు, 5 వెల్లుల్లి రెబ్బలు,  కొద్దిగా అల్లం, ఒక కప్పు కరివేపాకు లు,  రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.

2 / 5
ముందుగా గ్యాస్ ఆన్ చేసి దాని మీద పాన్ పెట్టుకుని  మెంతులను దోరగా వేయించి  చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుని మెత్తగా పొడిలా పట్టుకోవాలి. ఇప్పుడు పచ్చి మామిడికాయ తీసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ముందుగా పచ్చి మామిడికాయను తీసుకుని తురుము లాగా చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, మెంతి పొడి వేసి మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

4 / 5
ఆ తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ మీద నువ్వుల నూనెను పెట్టి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. 
అవి వేగుతున్నప్పుడు దానిలో వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించండి.  కొద్దీ సేపటి తర్వాత కొద్దిగా అల్లం, కరివేపాకు వేసి కలుపుకోవాలి.

ఆ తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ మీద నువ్వుల నూనెను పెట్టి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. అవి వేగుతున్నప్పుడు దానిలో వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించండి. కొద్దీ సేపటి తర్వాత కొద్దిగా అల్లం, కరివేపాకు వేసి కలుపుకోవాలి.

5 / 5
ఈ పోపు చల్లారిన తరువాత దానిలో ఉప్పు వేసి,  మామిడి తురుమును కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతే, ఆంధ్రా స్టైల్ మామిడికాయ తురుము పచ్చడి రెడీ. దీనిని వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ అదిరిపోతోంది.

Follow Us