Mushroom Curry Recipe: పుట్ట గొడుగులు అంటే ఇష్టమా.. రుచికరమైన ఆంధ్ర స్టైల్ పుట్ట గొడుగుల కర్రీ ఇంట్లోనే చేసుకోండిలా..

|

Aug 21, 2023 | 10:23 AM

పుట్ట గొడుగులు చాలా రకాలు ఉన్నాయి. ఇవి విత్తనాలు లేని మొక్క జాతికి సంబంధించినవి. అయితే వీటిలో ఉన్న పోషక పదార్ధాలు, ఔషదగుణాలు లభ్యతను బట్టి ప్రత్యేక వాతావరణంలో పెంచుతున్నారు . అందరూ తినగల కూర ఆహారము . ఇవి మాంసాహారముతో సమానము . ఆహారప్రియులకు వర్షాకాలము స్పెషల్ పుట్టగొడుగులు . ఆర్టిఫీషయల్ గా సాగయ్యేవి, డ్రైమష్రూమ్‌స్ ఏడాది పొడుగునా లభించినప్పటికీ సహజం గావచ్చే పుట్టగొడుగుల కోసం మాత్రము ముసురు వానలు కురవాల్సిందే . వానాకాలములో పుట్టలమీద మొలిచే ఈ గొడుగులు రుచిలో సాటిలేనివి ఈరోజు ఆంధ్రా స్టైల్ లో మష్రూమ్‌ కర్రీ తయారీ విధానం గురించి తెలుసుకుందాం.

1 / 6
పుట్టగొడుగులను ఇంగ్లీషులో మష్రూమ్స్ అంటారు. ఇవి ఎక్కువగా పుట్టలపై గొడుగు ఆకారంలో పెరుగుతాయి. అందువలన వీటిని పుట్ట గొడుగులు అంటారు. ఈ పుట్ట గొడుగులు చాలా రకాలు ఉన్నాయి. ఇవి విత్తనాలు లేని మొక్క జాతికి సంబంధించినవి. అయితే వీటిలో ఉన్న పోషక పదార్ధాలు, ఔషదగుణాలు లభ్యతను బట్టి ప్రత్యేక వాతావరణంలో పెంచుతున్నారు . అందరూ తినగల కూర ఆహారము . ఇవి మాంసాహారముతో సమానము.

2 / 6
ఆహారప్రియులకు వర్షాకాలము స్పెషల్ పుట్టగొడుగులు . ఆర్టిఫీషయల్ గా సాగయ్యేవి, డ్రైమష్రూమ్‌స్ ఏడాది పొడుగునా లభించినప్పటికీ సహజం గావచ్చే పుట్టగొడుగుల కోసం మాత్రము ముసురు వానలు కురవాల్సిందే . వానాకాలములో పుట్టలమీద మొలిచే ఈ గొడుగులు రుచిలో సాటిలేనివి ఈరోజు ఆంధ్రా స్టైల్ లో మష్రూమ్‌ కర్రీ తయారీ విధానం గురించి తెలుసుకుందాం.

3 / 6
కావలసిన పదార్థాలు: పుట్ట గొడుగులు, పావు కిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, పసుపు, కొత్తిమీర, నూనె, ఉప్పు తగినంత, అల్లం తురుము, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, ధనియాలు

4 / 6
పుట్టగొడుగుల్ని కడిగి ముక్కలుగా కోయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా పొడవుగా తరగాలి. మసాలా కోసం తీసుకున్న వాటిని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

5 / 6
గ్యాస్ స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేసుకుని ముందుగా పుట్టగొడుగులను కొంచెం సేపు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ నూనెలో ఉల్లిముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.

6 / 6
తరువాత ఉప్పు వేసి ఐదు నిమిషాలు వేయించాలి. తర్వాత మసాలా ముద్ద వేసి బాగా వేయించి తర్వాత పుట్ట గొడుగులు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. అనంతరం కప్పు నీరు పోసి మీడియం మంట మీద రెండు నిమిషాలు ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లి దించితే సరిపోతుంది.