
పంచాంగం ప్రకారం, పూజ ముహూర్తం సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి 11:57 గంటల నుండి మొదలయ్యి సెప్టెంబర్ 5వ తేదీ తెల్లవారుజామున 12:43 గంటల వరకు ఈ పండుగను భక్తులు చేసుకోనున్నారు. అయితే, ఈ రోజు ఉదయం అందరూ తమ ఇళ్లలో శ్రీకృష్ణుడికి ఇష్టమైన ఆహారం కూడా తయారు చేస్తారు అదే మఖన్ మిశ్రీ

మఖన్ మిశ్రీకి కావలసిన పదార్థాలు: ఒక కప్పు తెల్లవెన్న , 4 టేబుల్ స్పూన్స్ ఉప్పు లేని పటిక బెల్లం పొడి అయితే, దీనిని మీరు కచ్చాపచ్చాగా దంచుకోవాలి, కొద్దిగా కుంకుమపువ్వు, 5 తులసి ఆకులు, మూడు రకాల డ్రై ఫ్రూట్స్, దీనిలో తరిగిన పిస్తా, బాదం పప్పులు తీసుకోవాలి.

మఖన్ మిశ్రీ తయారీ విధానం: ముందుగా వెన్నను రెడీ చేసుకోవాలి. ఇంకా మీ ఇంట్లో తయారుచేసిన తాజా వెన్నను మాత్రమే తీసుకోవాలి. మీ దగ్గర అందుబాటులో లేకపోతే, తాజా మీగడ పెరుగును చిలికి దాని నుంచి వెన్నను వేరు చేసి, ఒక గిన్నెలోకి శుభ్రపరచుకోవాలి.

మఖన్ మిశ్రీ తయారీ విధానం స్టెప్ 1 : ఆ తరువాత మిశ్రిని రెడీ చేసుకోవాలి: ముందుగా పటికబెల్లం గింజలను తీసుకుని రోట్లో వేసుకుని కచ్చాపచ్చాగా వాటిని దంచుకోవాలి. ఈ పొడిని తీసుకుని ఒక ప్లేట్ లేదా గిన్నెలో పెట్టుకోవాలి. దీనిని మీరు చివర్లో వేయాలి

ఇక ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో వెన్నను వేసి స్పూన్‌తో క్రీమ్‌లాగా కలుపుకోవాలి.ఇప్పుడు దానిలో మీరు పొడిలా చేసుకున్నా మిశ్రి పొడిని వేసి దీనిలో కలుపుకోవాలి. ఇంకా ఈ వెన్నలో మిశ్రి కరిగితే ఆ తీపి రుచి మంచిగా ఉంటుంది. చివరలో కుంకుమపువ్వు కూడా వేస్తే మంచిగా ఉంటుంది.