1 / 7
చుట్టూ పచ్చని కొండలు, మధ్యలో దేవుడి గుడి. దేవుని మందిరం చుట్టూ జింకలు, జంతువుల కొమ్ములను పట్టుకొని లయబద్ధమైన మంత్రోచ్ఛారణకు భక్తుల బృందం నృత్యం చేస్తుంది. కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లా మడికేరి తాలూకా ఇబ్బనివాలవాడి గ్రామంలో భద్రకాళి దేవత ఉత్సవం సందర్భంగా కనిపించిన దృశ్యాలివి.