

ఈ జ్యుసి ఫ్రూట్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడే ఒక పోషకం. లీచీ వ్యాధి సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

లీచీలో ఉండే పొటాషియం, కాపర్ గుండెకు మేలు చేస్తాయి. అంతే కాదు లీచీలో ఉండే ఒలిగోనాల్ గుండెలో సాధారణ రక్త ప్రసరణను నిర్వహించే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

బరువు తగ్గాలనుకునే వారు లిచీ తినవచ్చు. ఈ జ్యుసి, తీపి పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఒక కప్పు లీచీలో దాదాపు 125 కేలరీలు ఉంటాయి.

లిచీలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే లిచీలోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

అజీర్ణంతో ఇబ్బంది పడుతుంటే లిచీ తినండి. లిచీలో తేలికగా జీర్ణమయ్యే ఫైబర్ ఉంటుంది. ఈ పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. లీచీ పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

చర్మ సమస్యలను నివారించడానికి లిచీని కూడా తినవచ్చు. లిచీలోని వివిధ పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మొటిమలు, మచ్చలను నివారించడంలో సహాయపడుతుంది. లిచీ ముడతలు రాకుండా కూడా సహాయపడుతుంది