
రోగనిరోధక శక్తి: నీరు సహజంగానే శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడి, అంటువ్యాధుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.

వేసవిలో ఎండ వేడిమి తీవ్రంగా ఉంది. అటువంటి పరిస్థితిలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో చెమ, మూత్రం ద్వారా మలినాలు బయటకు పోతాయి.శరీరంలో ప్రతి కణం, కణజాలం, అవయవం సరిగ్గా పనిచేస్తాయి. శరీర ఉష్ణోగ్రతలు కూడా నియంత్రణలో ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

తక్షణ శక్తి: ఉదయాన్నే నీరు తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాకుండా రోజంతా మనం తినే ఆహారంలోని పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది.అల్పాహారానికి కనీసం 30 నిమిషాల ముందు నీరు తాగడం వల్ల అదనపు కేలరీలు తీసుకోకుండా నిరోధించవచ్చు.

జీర్ణక్రియ సాఫీగా: ఉదయం నీరు తాగడం వల్ల పేగులు శుభ్రపడతాయి. ఇది ప్రేగు కదలికలను మెరుగుపరిచి, మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యలను నివారిస్తుంది. ఫలితంగా రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.

అలాగే వేసవిలో అనారోగ్యంగా అనిపిస్తే వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగండి. ఇది సగానికి పైగా సమస్యలను పరిష్కరిస్తుంది. మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచి ఆరోగ్యం కాపాడుతుంది. ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగాలి. అలసట, తలనొప్పి, ఒత్తిడి ఉన్నప్పుడు టీ, కాఫీల కంటే మంచినీరు తాగడం మేలు.

అందుకే వేసవిలో పుష్కలంగా నీళ్లు తాగాలి. నీళ్లతోపాటు నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగడం మచిది. వేసవిలో తరచుగా తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.. అలాంటి పరిస్థితిలో వీలైనంత ఎక్కువ నీళ్లు తాగాలి.