
కలబంద వలన మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది చర్మానికి రక్షణగా ఉంటుంది. అందుకే దీనిని ఆయుర్వేదంలో కూడా వాడుతారు.

అంతేకాదు, ఇది జీర్ణవ్యవస్థను, జుట్టును బలంగా ఉంచుతుంది. ఇంకా దీనిలో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కాలిన గాయాలను కూడా తగ్గిస్తుంది. అయితే, ఇది కొందరికి మాత్రం చాలా డేంజర్ అని చెబుతున్నారు.

కలబంద అందరికీ మేలు చేస్తుంది. కానీ, గర్భిణీ స్త్రీలకు మాత్రం అస్సలు మంచిది కాదని పరిశోధనలు చేసి మరి చెబుతున్నారు. కాబట్టి ,వీళ్ళు దీనిని తీసుకోకపోవడమే మంచిది.

కలబందను మితి మీరి తీసుకుంటే విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, ఎక్కువగా దీనిని వాడకండి. అంతే కాదు, ఇది మూత్రపిండాలపైన కూడా ఒత్తిడిని కలిగిస్తుంది.

గర్భిణీలు, పాలిచ్చే మహిళలు దీనికి దూరంగా ఉండాలి. ఎందుకంటే, ఇద్దరికీ మంచిది కాదు. అంతేకాదు, రుతుక్రమ సమయంలో చిన్న పిల్లలకు కలబందను వాడకూడదు. ఒక వేళ వాడేముందు డాక్టర్ ను సంప్రదించి వాడాలి.