మందుబాబులకు అలర్ట్.. మద్యం తాగుతూ ఈ పదార్థాలను తిన్నారంటే డైరెక్టుగా ఆసుపత్రికే..

Updated on: Dec 27, 2025 | 2:49 PM

మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు.. అయినా.. చాలా మంది అస్సలు వినరు.. ఈ రోజుల్లో మద్యం తాగడం అనేది సర్వసాధారణమైపోయింది. అయితే.. మద్యం తాగేటప్పుడు కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

1 / 6
మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం.. అయినా.. చాలా మంది అస్సలు వినరు.. ప్రస్తుత కాలంలో ఇది సర్వసాధారణంగా మారింది.. అయితే.. సాధారణంగా మద్యం సేవించేటప్పుడు కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటారు. ఈ విధంగా తీసుకునే కొన్ని ఆహారాలు.. మద్యం కంటే హానికరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి శరీరంలో కొన్ని సమస్యలను కలిగిస్తాయంటున్నారు. అందుకే.. మద్యం తాగేటప్పుడు తినకూడని కొన్ని ఆహారాల గురించి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.

2 / 6
ముఖ్యంగా, రాత్రిపూట, అలాగే ఎప్పుడైనా మద్యంతో తీసుకునే ఆహారాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని.. కొన్నింటి జోలికే అస్సలు పోకూడదని పేర్కొంటున్నారు. ఎందుకంటే.. మద్యంతో పాటు తీసుకుంటే.. పలు ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లేనని చెబుతున్నారు.

3 / 6
కొంతమంది మద్యం తాగుతూ వేయించిన లేదా నూనె ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. అయితే, అలాంటి నూనె పదార్థాలను ఆల్కహాల్‌తో కలిపి తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, కడుపు సమస్యలు వస్తాయి. అంతేకాకుండా, ఇది ఊబకాయాన్ని పెంచుతుంది.

4 / 6
అదేవిధంగా, మీరు మద్యం సేవించేటప్పుడు స్పైసీ ఫుడ్ తినకూడదు. ముఖ్యంగా, మీరు స్పైసీ చికెన్, మటన్ తినకూడదు... అలాగే, ఆల్కహాల్ తో ఆమ్లెట్ ఎప్పుడూ తినకూడదని పేర్కొంటున్నారు.

5 / 6
ఇంకా, ఆల్కహాల్ తాగుతూ బ్రెడ్ తో తయారు చేసిన ఏవైనా ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే, చాక్లెట్, బర్గర్లు, పిజ్జా మొదలైన ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రావడమే కాకుండా, గ్యాస్, గుండెల్లో మంట, ఉబ్బరం వంటి సమస్యలు కూడా వస్తాయి.

6 / 6
మద్యం తాగేటప్పుడు, అలాగే తాగిన తర్వాత పాల ఉత్పత్తులు, వేడి సాస్ వంటి ఆహారాలు తినడం జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. బదులుగా, కూరగాయలు, పండ్లు తినడం మీ ఆరోగ్యానికి మంచిది. మద్యం సేవించడం మీ ఆరోగ్యానికి హానికరం. మీరు దానిని పూర్తిగా వదులుకోలేకపోయినా, దానిని మితంగా తీసుకోవడం మంచిది.