
లడఖ్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఇలాంటి అనేక సరస్సులు ఉన్నాయి. అవి కనిపంచే నీలం రంగు కన్నులను కట్టిపడేస్తుంది. ఈ సరస్సు దృశ్యం ఎంతో అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం కూడా అలాంటి బ్లూ లేక్స్ పర్యటనకు వెల్దాం..

Crater Lake, Oregon: క్రేటర్ అమెరికాలో అతిపెద్ద సరస్సు. దీని లోతు 1,943 అడుగులు, ప్రభుత్వం దాని చుట్టూ ఒరెగాన్ ఏకైక జాతీయ ఉద్యానవనాన్ని సృష్టించింది. ఈ సరస్సు లోతైన నీలం రంగుతో ప్రత్యేక ఆకర్షణగా పర్యాటకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. సరస్సులో నీరు మంచు, వర్షం నుండి వస్తుంది.

Lake Baikal, Russia: రష్యాలోని బైకాల్ సరస్సు రంగు కూడా ముదురు నీలం రంగులో ఉంటుంది. ఈ సరస్సు లోతు 5,300 అడుగులు. అంతేకాదు..ఇది 400 మైళ్ల పొడవు ఉంటుంది. ఈ సరస్సులో 27 ద్వీపాలు, 1500 రకాల జీవ జాతులు కనిపిస్తాయి.

Lake Pukaki, New Zealand: చుట్టూ పెద్ద పెద్ద పర్వత శ్రేణులతో ఏర్పడింది పుకాకి సరస్సు. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగరంలో ఉంది. ఈ సరస్సు రంగు కూడా నీలం వర్ణంలోనే కనిపిస్తుంది. దీని కారణంగా దాని అందం మరింత పెరుగుతుంది. గ్లేసియల్ ఫ్లోర్ అని పిలువబడే పుకాకి సరస్సులో అనేక రకాల కణాలు కనిపిస్తాయి.

Torch Lake, Michigan: మిచిగాన్ టార్చ్ లేక్ 19 మైళ్ల పొడవు ఉంటుంది. హౌస్‌బోట్ యాత్రను ఆస్వాదించడానికి ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. టార్చ్ లేక్ దాని చుట్టుపక్కల వాతావరణం కంటే చాలా అందంగా కనిపిస్తుంది.