
నిద్ర అనేక వ్యాధులకు కారణం. శరీరానికి తగినంత నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీకు సరిపడా నిద్ర చాలా ముఖ్యం. అయితే నేటి కాలంలో చాలా మంది నిద్ర రావడం లేదని ఫిర్యాదు చేస్తుంటారు. దీంతో మందుల కోసం వైద్యుల వద్దకు క్యూ కడుతుంటారు. ఉద్యోగం, ఇంటిని చక్కదిద్దుకోవడంలో పడిపోయి ఒత్తిడి, ఇతర కారణాల వల్ల చాలా మందికి తగినంత నిద్ర రాదు.

పైగా ఇతర పనుల హడావిడిలో నిద్ర తరచుగా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా నిరంతరం నిద్ర లేకపోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య పరిణామాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది శరీరాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది.

నిద్ర లేకపోవడం మీ నాడీ వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. రాత్రి పూట ప్రతి ఒక్కరూ కనీసం 7-8 గంటలు గాఢంగా నిద్రపోకపోతే మీ మెదడుకు తగినంత విశ్రాంతి లభించదు.

నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్ల స్థాయిలు నేరుగా పెరుగుతాయి. దీంతో ఒత్తిడి పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో మీరు ఉదయం మేల్కొన్నప్పుడు మీ తల బరువుగా అనిపిస్తుంది. మీరు అస్సలు తాజాగా ఉండలేరు.

నిద్రలేమి వల్ల మైగ్రేన్లు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. దీనితో పాటు అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల మంచి ఆరోగ్యానికి ఎక్కువ నీళ్లు తాగడం, యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. ఇవి మీ రాత్రి నిద్రకు ఉపయోగపడతాయి.